»   » నిర్మాతగా మారుతున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ

నిర్మాతగా మారుతున్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలనంగా మారి వివాహం చేసుకుని వెళ్ళిపోయిన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొన్న "ఆరెంజ్" ఆడియో పంక్షన్ తో మళ్ళీ సీన్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఖాళీగా ఉండదలచుకోలేదని తెలుస్తోంది. ఆమె తన సోదరుడు రామ్ చరణ్ తేజ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్టుగా ఉంటామని మాట ఇచ్చారని అంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఇలాంటివన్నీ టెన్షన్ తో కూడుకున్నవని, తండ్రిగా నచ్చచెప్పబోయాడు కానీ ఆమె పట్టుదల చూసి అలాగే అన్నారని తెలుస్తోంది. ఇక మరో ప్రక్క మహేష్ సోదరి మంజుల, విష్ణు వర్ధన్ సోదరి లక్ష్మీ ప్రసన్న, నాగార్జున సోదరి నాగలక్ష్మి నిర్మాతలుగా మారి తన సోదరులతో సినిమాలు తీయటం ఆమెకు ప్రేరణ ఇచ్చిందంటున్నారు. కాబట్టి త్వరలోనే శ్రీజ నిర్మాతగా మారినట్లు న్యూస్ వస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu