»   » శ్రీకాంత్ 'రంగ ది దొంగ' రిలీజయ్యేదెప్పుడంటే...

శ్రీకాంత్ 'రంగ ది దొంగ' రిలీజయ్యేదెప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాంత్, విమలారామన్ కాంబినేషన్ లో రూపొందిన 'రంగ ది దొంగ' చిత్రం డిసెంబర్ పదవ తేదీన విడుదల కానుంది. గతంలో నితిన్ తో హీరో చిత్రాన్ని రూపొందించిన సుధాకర్‌నాయుడు (జీవి) ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం విశేషాలను మీడియాకు తెలియచేస్తూ దర్శకుడు..."ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలో తొలి కాపీ వస్తుంది. చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేయాలనుకుంటున్నాం. కొత్త ఒరవడిలో సాగే ఫక్తు మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ దశలో ఉన్నాయని అన్నారు.

గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, గాడ్‌ఫాదర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర అల్లరి దొంగ, మరో పాత్ర కరుడు గట్టిన ప్యాక్షనిస్ట్. వీరిధ్దరి మధ్యా జరిగే కథనంతో చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా తయారవుతోంది. ఇక దొంగగా శ్రీకాంత్ ఈ చిత్రంలో కేవలం పోలీసుల ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసే పాత్రలో కనిపిస్తారు.రమ్యకృష్ణ, సాక్షి శివానంద్, భువనేశ్వరి, తస్లీమా, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, శివాజీరాజా, డా.మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం: చక్రి, కెమెరా: పూర్ణకాండ్రు, కూర్పు: గౌతంరాజు, కళ: ఎం.బంగార్రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎ.అజీమ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu