»   » శ్రీకాంత్ ‘నాటు కోడి’కి గోపీచంద్ క్లాప్

శ్రీకాంత్ ‘నాటు కోడి’కి గోపీచంద్ క్లాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీకాంత్ హీరోగా 'నాటు కోడి' చిత్రం తెరకెక్కబోతోంది. నాని కృష్ణ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్ర ప్రారంభోత్సవం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హీరో గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ముహూర్తపు సన్నివేశానికి సి.ఆర్.మనోహర్ కెమెరా స్విచాన్ చేసారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

గతంలో శ్రీకాంత్, నానికృష్ణ కాంబినేషన్ 'దేవరాయ' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ...'దేవరాయ చిత్రాన్ని నానికృష్ణతో చేసాను. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. పూర్తి ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో 'నాటుకోడి' ఉంటుంది. ఇటీవల కొన్ని సీరియస్ సినిమాలు చేసాను. కానీ ఇది మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా' అని తెలిపారు.

దర్శకుడు సినిమా గురించి వివరిస్తూ...'ఈ సినిమా మొత్తం తండ్రికొడుకుల మధ్య సాగుతుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి, రూరల్ ఎస్‌ఐకి మధ్య జరిగే కథ. మంచి తక్కువ, మసాలా ఎక్కువ అనే కాన్సెప్టుతో వెళ్తున్నాం. కోట శ్రీనివాసరావు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. హీరో పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఊర్లో కోడి పందాలు ఆడకూడదుకానీ, సిటీల్లో గుర్పు పందేలుఆడవచ్చా, ఊర్లలో చెట్లకింద పేకాట ఆడితే తప్పు, సిటీ క్లబ్బుల్లో ఆడితే ఒప్పా?, ఊర్లలో భోగం మేళాలు తప్పుకానీ, సిటీల్లో ఫ్యాషన్ షోలు, డాన్సులు ఆడితే తప్పేలేదా? అని ప్రశ్నించే రకం' అని చెప్పుకొచ్చారు.

ఎంఎస్ నారాయణ, జీవా, కొండవలస, రఘు, ప్రభు, చిట్టి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ బందరు బాబి, కెమెరా : మల్లేష్ నాయుడు, సంగీతం : యాజమాన్య, మాటలు : రవిరెడ్డి మల్లు, ఆర్ట్ : జె.కె.మూర్తి, నిర్మాత-కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : నాని కృష్ణ.

English summary
Srikanth starrer 'Naatu Kodi' Movie Launch Function held in Hyderabad. Srikanth, Gopichand, Director Nani Krishna, Ramesh Puppala, Sagar graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu