»   » మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పాటలు ఇవే...

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పాటలు ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' ఆడియో ఈ నెల 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల వివరాలు బయటకు వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం మొత్తం 6 పాటలు కంపోజ్ చేసారు.

పాటల లిస్టు..


1. రామ రామ
2. జత కలిసే
3. చారు శీల
4. శ్రీమంతుడా
5. జాగో...
6. దిమ్మ దిరిగే


Srimanthudu audio Track List

ఈ ఆడియో వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమాను ఆగస్టు 7న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి జులై 17నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ‘బాహుబలి' కోసం వాయిదా వేసుకున్నారు.


ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని, టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
Mahesh Babu upcoming film 'Srimanthudu' audio Track List.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu