twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీమంతుడు’ చిత్రానికి హాలీవుడ్ స్టార్స్ జాకీ చాన్, షరాన్ స్టోన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' చిత్రాన్ని హాలీవుడ్ స్టార్స్ జాకీ చాన్, మార్టిన్ షీన్, షరాన్ స్టోన్ లాంటివారు తిలకించబోతున్నారు. వీళ్లకి తెలుగు రాదు కదా? ఈ సినిమా ఎలా చూస్తారు? అనే డౌట్ వద్దు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ప్రదర్శిస్తారని తెలుస్తోంది.

    ఆగస్టు 7 నుంచి 16వ తేదీ వరకూ కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో 'ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్' పేరిట జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రారంభ చిత్రంగా మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' సినిమాను ప్రదర్శిస్తున్నారు. రేపు రాత్రి రాత్రి 8:30 గంటలకు సాన్ జోస్ లోని 'కెమెరా 12 సినిమాస్'లో ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా శ్రీమంతుడు తొలి చిత్రంగా ప్రదర్శింపబడుతోంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘శ్రీమంతుడు' సినిమాతో పాటు, ఈ నెల 12న 'మిణుగురులు' చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు.

    Srimanthudu movie opens the prestigious Festival of Globe

    శ్రీమంతుడు సినిమా వివరాల్లోకి వెళితే...
    తెలుగుతో పాటు తమిళంలో ‘సెల్వందన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.

    ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Superstar Mahesh Babu movie "Srimanthudu" is selected as the opening movie night for the "Festival of Globe" to be held in San Jose, California from August 7th to 16th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X