»   » సచిన్ టెండూల్కర్ కోసం ‘శ్రీమంతుడు’ స్పెషల్ షో

సచిన్ టెండూల్కర్ కోసం ‘శ్రీమంతుడు’ స్పెషల్ షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శ్రీమంతుడు' చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈచిత్రం భారీగా వసూళ్లు సాధించింది. దీంతో పాటు మంచి సినిమా అనే మన్ననలూ అందుకుంటోంది. సోషల్ రెస్పాన్సబులిటీతో పాటు ఎంటర్టెనింగ్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతం అంటూ పలువురు ప్రముఖులు పొగడ్తలు గుప్పిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఈ సినిమాను ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేకంగా చూపించబోతున్నారట. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్ని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమా చూసిన ప్రముఖులంతా తమ సొంత గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఏవైనా గ్రామాలను దత్తత తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.


Srimanthudu’s special show for Sachin

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తన్న సంగతి తెలిసిందే. అయితే ‘శ్రీమంతుడు' ట్రైలర్‌లోని రాజేంద్రప్రసాద్, శ‌ృతిహాసన్, ఊరి జనం నడుచుకుంటూ వచ్చే సన్నివేశం సినిమాలో లేదు. ఆ సీన్‌ని ఈనెల 28నుంచి జత చేయనున్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
As per the Srimanthudu movie producers’ announcement, legendary Indian cricketer, Sachin Tendulkar, will be watching Srimanthudu very soon.
Please Wait while comments are loading...