»   » మహేష్ బాబు అంటే పిచ్చి, అందుకే అంత రేటు!

మహేష్ బాబు అంటే పిచ్చి, అందుకే అంత రేటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ప్రేక్షకులు కొందరు హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. వారిలో టాప్ లో ఉండే హీరో మహేష్ బాబు. త్వరలో మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్టెన్మెంట్స్ ఛానల్స్ పోటీ పడ్డాయి. ఆ పోటీలో జీ తెలుగు వారు అత్యధికంగా రూ. 10 కోట్లు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాటీవీలో వేస్తే ఛానల్స్ కు మంచి లాభాలు వస్తాయి. అందుకే ఇంత పెద్ద మొత్తం అయినా వెనకాడకుండా సొంతం చేసుకున్నారు.


Srimanthudu Satellite Rights grabbed for 10cr!

శ్రీమంతుడు ఆడియో వేడుక జూన్ 26న చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా జులై 17న విడుదల కానుంది. ఆడియో వేడుక టెలికాస్ట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత అత్యధికంగా ఆడియో వేడుక టెలికాస్ట్ రైట్స్ అమ్ముడు పోయింది శ్రీమంతుడు సినిమాకే అని అంటున్నారు.


Srimanthudu Satellite Rights grabbed for 10cr!

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
Srimanthudu is making a merry at the box office. Already the movie is being picked up for record prices in many areas and now the satellite rights were picked for a whopping 10 Crore by Z-Telugu.
Please Wait while comments are loading...