»   » శ్రీమంతుడు పక్కా ప్లానింగ్: 60 రోజులు, 80 కోట్లు!

శ్రీమంతుడు పక్కా ప్లానింగ్: 60 రోజులు, 80 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలు పంచుకోవడం సినిమాకు బాగా ప్లస్సయింది. సినిమా షెడ్యూల్ పక్కా ప్లానింగుతో పూర్తి చేసారు. షూటింగ్ కేవలం 60 రోజుల్లో పూర్తి చేసారు.

సినిమా రూ. 80 కోట్లు వసూలు చేస్తుందనే టార్గెట్ తో విడుదల చేసారు. అనుకున్నట్లే సినిమా బాక్సాపీసు వద్ద సంచలన విజయం సాధించింది. కేవలం తొలి వారం రోజుల్లోనే రూ. 57 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


Srimanthudu shot in flat 60 days

ఈ వీకెండ్ ఆగస్టు 15, ఆదివారం హాలిడే ఉండటంతో రెండో వారం పూర్తయ్యే లోపే సినిమా రూ. 80 కోట్ల మార్కను అందుకుంటుందని భావిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా చరిత్ర సృష్టించబోతోంది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి సినిమా తర్వాతి స్థానం ‘శ్రీమంతుడి' అంటున్నారు విశ్లేషకులు.


ఇప్పటికే ‘శ్రీమంతుడు' సినిమా చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. హీరో సినిమా నిర్మాణంలో బాగస్వామి అయితే బడ్జెట్ అదుపులో ఉంటుంది అని మహేష్ బాబు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీమంతుడు సినిమా విషయంలో ఈ విషయం నూటికి నూరు శాతం నిజమైంది. మహేష్ బాబు రేంజి హీరోతో సినిమా తీయడం అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ ‘శ్రీమంతుడు' సినిమాను అత్యంత తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో పూర్తి చేసారు. ఇకపై నిర్మాతలంతా మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary
Mahesh Babu's Srimanthudu shot in flat 60 days and within a week, the film made Rs around 60 crores.
Please Wait while comments are loading...