»   »  ఎన్టీఆర్ పర్శనల్ గా మహేష్ కు కాల్ చేసి...

ఎన్టీఆర్ పర్శనల్ గా మహేష్ కు కాల్ చేసి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: దాదాపు మూడు నెలల లండన్ షెడ్యూల్ ని నాన్నకు ప్రేమతో చిత్రం కోసం పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చారు ఎన్టీఆర్. ఇక్కడకు వచ్చాక ఆయన తన దర్శకుడు సుకుమార్ తో కలిసి శ్రీమంతుడు చిత్రం చూసినట్లు సమాచారం. సినిమా చూసిన వెంటనే ఇంప్రెస్ అయ్యి...మహేష్ కు పర్శనల్ గా కాల్ చేసి అభినందనలతో ముంచెత్తారని తెలుస్తోంది. మంచి సినిమా చేసి ఘన విజయం సాధించినందుకు ఆయన ప్రశంసించినట్లు చెప్తున్నారు.

ntr talk

ఇక మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.ఆగస్టు 7న విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై ఈ చిత్రం కథ ఆధారపడి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేపథ్యంలో గ్రామాల దత్తత కార్యక్రమం వూపందుకున్న విషయం తెలిసిందే.

mahesh

మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.
English summary
NTR watched Srimanthudu and was so impressed with the film that he immediately called up the film's hero Mahesh Babu and congratulated him for such a brilliant film and the grand success.
Please Wait while comments are loading...