»   » అటా..ఇటా ఈ నెలలోనే తేలిపోతుంది

అటా..ఇటా ఈ నెలలోనే తేలిపోతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'అష్టాచమ్మా' హీరో శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారాడు. వారాహి చలనచిత్రం, సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ పతాకంపై 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. రజనీ కొర్రపాటి రూపొందించిన ఈ చిత్రంలో శౌర్య, రాశిఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ చిత్రం హిట్ అయితే ఇక అవసరాల దర్శకుడుగా తెలుగులో సెటిల్ అయిపోయినట్లే...లేదా నటుడుగా కొనసాగే అవకాసం ఉంది.

శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ "ఈ కథను 15 నిమిషాల్లో సాయిగారికి చెప్పాను. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. నేను కూడా ఓ పాత్రను చేద్దామనుకుని తర్వాత వద్దనుకున్నాను. కానీ సాయిగారు చేయమనడంతో చేసేశాను. 'అష్టాచమ్మా' చేసినప్పటి నుంచి నాకు కల్యాణిగారు బాగా తెలుసు. మంచి సంగీతాన్నిచ్చారు. శౌర్య, రాశి చాలా బాగా నటించారు. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు.

Srinivas Avasarala's Oohalu Gusagusalaade releasing on

చిత్ర సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి మాట్లాడుతూ "మెలోడీలను చేయడానికి ఆసక్తి చూపుతాను. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ఓ పాటకు రెండు రకాల ట్యూన్లు కట్టాం. అనంతశ్రీరామ్ రెండు పాటలను రాశారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: కల్యాణి కోడూరి, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.

English summary
Naga Shourya, Raashi Khanna's Oohalu Gusagusalaade completed its censor formalities and is readying for release on June 20th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu