వరుసగా మూడు కామెడీ సినిమాలు.. రూమర్స్ పై ఘాటుగా స్పందించిన శ్రీనువైట్ల..
ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ ఈవివి.సత్యనారాయణ శిష్యులలో శ్రీనువైట్ల ఒకరు. ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఎన్నిసార్లు చూసినా నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తాయి. అయితే వరుసగా డిజాస్టర్స్ రావడం వలన ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గుతోంది. ఆగడు నుంచి కాంటిన్యూగా అపజయాలను చూస్తున్నారు.
మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టడంతో చిన్న హీరోలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు వెనుకడుగు వేసినట్లు రూమర్స్ బాగానే వచ్చాయి. ఇక మొత్తానికి మళ్ళీ విష్ణుతో ఢీ లాంటి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. దానికి డీ అండ్ ఢీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.

ఇక ఆయనకు అవకశాలు రాకపోవడానికి కారణం ఫెయిల్యూర్స్ కారణమని, అందుకే ఎక్కువగా గ్యాప్ వచ్చిందని కథనాలు రాగా అందులో ఎలాంటి నిజం లేదని శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చారు. కేవలం కరోనా కారణంగానే గ్యాప్ వచ్చిందని ఇప్పటికే ఢీ లాంటి మరో కథ ఆల్ మోస్ట్ సిద్ధమయ్యిందని అన్నారు. ఇక కాంటిన్యూగా మూడు సినిమాలు కామెడీ జానర్ లోనే ఉంటాయని చెప్పారు. ప్రేక్షకుల తన నుంచి ఎలాంటి సినిమలైతే ఆశిస్తున్నారో అలాంటి సినిమాలే వస్తాయని కూడా చెప్పారు. ఇక శ్రీనువైట్ల ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











