శ్రీను వైట్ల దర్శకత్వంలో బాలకృష్ణ!
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారు 'లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ బాలయ్యతో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈచిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వ వహిస్తారని తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర...దర్శకుడు శ్రీను వైట్ల ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో శ్రీను వైట్లను బాలయ్యతో సినిమా తీయడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది.
లెజెండ్ సినిమా వివరాల్లోకి వెళితే...14రీల్స్ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్'.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం డైలాగులు, ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలయ్య అభిమానులు పండగ చేసుకునే విధంగా రూపొందిందని చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని వినికిడి.

ఓవరాల్ థియోటకల్ రైట్స్ 38- 40 వరకూ వెళ్లాయని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 28న విడుదలకు సిద్దం చేస్తున్నారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.
శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. స్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. సింహా తర్వాత సరైన హిట్ లేని బాలయ్య ఈచిత్రంతో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











