»   » ముదిరిన వివాదం: కోన వెంకట్‌పై కేసు పెట్టిన శ్రీను వైట్ల

ముదిరిన వివాదం: కోన వెంకట్‌పై కేసు పెట్టిన శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ మధ్య వివాదం మరింత ముదరింది. తాజాగా కోన వెంకట్ పై శ్రీను వైట్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య బాద్ షా సినిమా సమయంలోనే వివాదాలు ఏర్పడ్డాయి. తన టాలెంటును వాడుకుని తనకు క్రెడిట్ ఇవ్వడం లేదని అప్పట్లో శ్రీను వైట్లపై సంచలన కామెంట్స్ చేసారు కోన వెంకట్. శ్రీను వైట్లో కలిసి పని చేయనని అప్పట్లో ప్రకటించిన కోన వెంకట్... రామ్ చరణ్ కోరిక మేరకు ‘బ్రూస్ లీ' సినిమాకు శ్రీను వైట్లతో మళ్లీ కలిసారు.

అయితే ‘బ్రూస్ లీ' విడుదలై ప్లాప్ టాక్ రావడంతో మళ్లీ కోన వెంకట్... శ్రీను వైట్లపై విరుచుకుపడ్డారు. 'బ్రూస్‌లీ'కి 72 సీన్లు రాస్తే, యథాతథంగా తీసుకోలేదు. కొన్ని స్టార్టింగ్, కొన్ని మధ్య లో, కొన్ని ఎండింగ్ తీసుకున్నారు. నేను ఫీలయ్యా. 'దూకుడు' తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అని నమ్మిన ప్రేక్షకులు, బయ్యర్లు నష్టపోయారు" అంటూ చెప్పుకొచ్చారు 'బ్రూస్‌లీ' రచయిత కోన వెంకట్. అది రుజువు చేయటానికి తాను రాసిన సీన్లన్నీ బయటపెడతా అని ప్రకటించారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మార్నింగ్ షోకే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

Srinu Vaitla files a complaint on Kona Venkat

ఈ చిత్రానికి మందు శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య విభేధాలు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ చొరవతో వీరి మద్యన సయోధ్య కుదిరింది. వీరి కాంబినేషన్ లో ఈ బ్రూస్ లీ చిత్రం వచ్చింది.అయితే కథ, కథనాలే ఈ చిత్రాన్ని దెబ్బ తీసాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీను వైట్ల దీంతో కోన వెంకట్ ఎదురు దాడి ప్రారంభించారు.

శ్రీను వైట్ల మీద కోన వెంకట్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావే వేసేందుకు సిద్దమవుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ‘బ్రూస్ లీ' సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన నేపథ్యంలో తనకు తప్పుడు క్రెడిట్ అపాదించే ప్రయత్నం చేస్తున్నారని కోన వెంకట్ భావిస్తున్నారనే ప్రచారం జరిగింది. బ్రూస్ లీ సినిమా కోసం తాను అందించిన స్టోరీలో తన ప్రమేయం లేకుండా అనేక మార్పులు చేసారని, ఇపుడు సినిమా ప్లాపు కావడంతో తన స్టోరీ వల్లే సినిమా ప్లాప్ అయిందనే ప్రచారం చేస్తున్నారని కోన వెంకట్ ఆగ్రహంగా ఉన్నారని, తాను ఇచ్చిన ఒరిజినల్ స్టోరీ వాడకుండా, మార్పులు చేర్పులు చేసి ఇపుడు ఆ స్టోరీ తనదే అంటూ తన పేరు బదనాం చేస్తున్నారని కోన వెంకట్ వాదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రైటర్ గా తన పేరు చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న శ్రీను వైట్ల నుండి పబ్లిక్ గా అపాలజీ కోరుతూ రూ. 10 కోట్ల డిఫామేషన్ సూట్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగింది.

కోన వెంకట్ ఇంకా పరువు నష్టం దావా వేయక ముందు.... ఇపుడు శ్రీను వైట్ల అతనిపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.

English summary
Film Nagar source said that Srinu Vaitla had filed a complaint against writer Kona Venkat.
Please Wait while comments are loading...