»   » ఆ కథ కోసమే ఇన్నాళ్లు.. అన్ బిలివబుల్..

ఆ కథ కోసమే ఇన్నాళ్లు.. అన్ బిలివబుల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్‌' రూపొందుతున్నది. రెండు పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తైంది.

.ఏప్రిల్ 14న విడుదల

.ఏప్రిల్ 14న విడుదల

ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నామని దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ నటించారు.

ఇలాంటి కథ కోసమే..

ఇలాంటి కథ కోసమే..

డైరెక్ట‌ర్‌గా `మిస్ట‌ర్‌` వంటి క‌థ‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మంచి ఎమోష‌న్స్‌, కడుపుబ్బ నవ్వించే హాస్యం, మంచి సంగీతం, అందమైన దృశ్యాలకు స్కోప్ ఉన్న కథ ఇది. అవుట్‌పుట్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. అందుకు నా నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్. అంద‌రూ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు అని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు.

 ట్రావెల్ ఫిలింలా..

ట్రావెల్ ఫిలింలా..

మిస్టర్ చిత్రం ట్రావెల్ ఫిలింలా ఉంటుంది. దాని కోసం స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశాం. చిత్రం ఓ దృశ్యకావ్యంలా ఉంటుంది.

 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ బిలివబుల్..

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ బిలివబుల్..

మిక్కి జే మేయ‌ర్‌తో తొలిసారి పనిచేశాను. ఇందులో అద్భుతమైన ఆరు పాట‌లను ఇచ్చారు. ఫ‌స్ట్ హాప్ రీరికార్డింగ్‌తో చూశాను. ఇన్ని వేరియేష‌న్స్‌ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లొ చూపించ‌డం క‌ష్టం. మిక్కి అన్ బిలివ‌బుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు అని శ్రీనువైట్ల తెలిపారు.

వరుణ్‌తేజ్ సరసన లావణ్య.. హెబ్బా

వరుణ్‌తేజ్ సరసన లావణ్య.. హెబ్బా

ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్‌ సరసన లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్ నటించారు. ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
Mega Hero Varuntej, Srinu vaitla's movie ready for release on April 14th. In this occassion director Srinu Vaitla said that Mister would be like travel film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu