»   » చిరు ఫ్యాన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్ అంటున్న శ్రీను వైట్ల

చిరు ఫ్యాన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్ అంటున్న శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ-ది ఫైటర్' చిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులతో పాటు శ్రీను వైట్ల కూడా గతంలోనే అఫీషియల్ గా ఖరారు చేసారు.

తాజాగా ఈ విషయమై శ్రీను వైట్ల స్పందిస్తూ...‘బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి అతిథి పాత్ర ఆయన అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ లా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర అభిమానులకు వినోదాన్ని పంచేలా ఉంటుంది.' అన్నారు. చిరంజీవి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉండబోతున్నాయి.

ఈ చిత్రంలో చిరంజీవి 15 నిముషాల పాటు కనిపించనున్నారు.. రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కొద్ది రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srinu Vaitla said Chiru’s cameo will huge surprise for his fans

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌.

ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 16న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Srinu Vaitla said that Chiru’s cameo in Bruce Lee will be a huge surprise for his fans and will entertain them big time.
Please Wait while comments are loading...