»   » దుమ్ములో మహేష్ బాబు షూటింగ్ కష్టాలు (ఫోటోలు)

దుమ్ములో మహేష్ బాబు షూటింగ్ కష్టాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్ల తన తర్వాతి సినిమా 'ఆగడు' చిత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఎంతో కీలకమైన డస్ట్ సీన్ చిత్రీకరించారు. ఈ సీన్ చిత్రీకరణ ఎంతో చాలెంజింగ్‌గా తీసుకున్న శ్రీను వైట్ల సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసారట. సినిమా యూనిట్ మొత్తం బాగా సహకరించడం వల్లనే ఈ సీన్ ఇంత బాగా పూర్తయిందని అంటున్న శ్రీను వైట్ల మహేష్ బాబుతో పాటు, టీం మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ పేజీలో ప్రస్తావిస్తూ....'విపరీతమైన దుమ్ములో షూటింగ్ జరిగింది. ఈ సీన్ తెరపై విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. చిత్రీకరణకు సహకరించి హార్డ్ వర్క్ చేసి టీం మొత్తానికి హాట్స్ ఆఫ్....ముఖ్యంగా మై డియర్ సూపర్ స్టార్‌కు స్పెషల్ థాంక్స్' అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.

గతంలో శ్రీను వైట్ల, మహేష్ బాబు కలిసి 'దూకుడు' చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. 'ఆగడు' చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం. 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా మహేష్ బాబును చూడబోతున్నాం. దూకుడులో తెలంగాణ యాసలో అదరగొట్టిన మహేష్ బాబు ఇపుడు రాయలసీమ యాసలో డైలాగులు విసరనున్నాడు.

ప్రస్తుతం బళ్లారి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు.....

 దుమ్ములో కష్టపడుతూ మహేష్ బాబు ఇలా...

దుమ్ములో కష్టపడుతూ మహేష్ బాబు ఇలా...

విపరీతమైన దుమ్ము ప్రదేశంలో ముఖానికి కర్చీప్ కట్టుకుని చాలా కష్టపడుతూ మహేష్ బాబు షూటింగులో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు.

ఆగడు రెగ్యులర్ షూటింగ్

ఆగడు రెగ్యులర్ షూటింగ్

అక్టోబర్ 25, 2013న ‘ఆగడు' మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంది. డిసెంబర్ 2 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్ లో కొన్ని సీన్లు చిత్రీకరించారు.

ఆగడు ఫస్ట్ షెడ్యూల్

ఆగడు ఫస్ట్ షెడ్యూల్

ఆగడు సినిమా ఫస్ట్ షెడ్యూల్ విషయానికొస్తే.... హీరోయిన్ తమన్నా డిసెంబర్ 12న షూటింగులో జాయినైంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్ సెట్ వేసారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్జరిగింది.

సారథి స్టూడియోలో...

సారథి స్టూడియోలో...

ఆ తర్వాత హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో వేసిన సెట్లో షూటింగ్ జరిగింది. అనంతరం నానక్ రామ్ గూడ లో ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్. ఆగడు మూవీ ఆడియోను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

English summary
Director Srinu Vaitla, who has recently started shooting for his next movie Aagadu, has all thanks to Superstar Mahesh Babu and the entire film unit. The director has recently wrapped up the filming of a dust scene, which is said to be a crucial for the film and was a big challenge to shoot. Everyone in the team reportedly cooperated very well with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu