»   » కొత్తగా..చిరుతో ఫంక్షన్: బన్నీ విషెస్, లావణ్య త్రిపాఠి వెరీ హాట్ (ఫోటోస్)

కొత్తగా..చిరుతో ఫంక్షన్: బన్నీ విషెస్, లావణ్య త్రిపాఠి వెరీ హాట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్ల అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. పరశురాం (బుజ్జీ) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం థియేట్రికల్ ట్రైలర్ మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి శిరీష్ అన్న అల్లు అర్జున్ హాజరు కాక పోయినా...ట్విట్టర్ ద్వారా విష్ చేసారు.

సినిమాను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తనున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై హీరో తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సినిమా తీస్తే నిర్మాణ విలువలు ఏలా ఉంటాయో తన మార్క్ చూపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సంబందించిన సాంగ్ టీజర్, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ఇప్పటికే రెండు సినిమాలు చేసినా శిరీష్ అనుకున్న స్థాయికి రాలేక పోయాడు. లుక్ పరంగానే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా వీక్ ఉండటమే అతనిలోని ప్రధాన లోపం. చాలా కష్టపడి గత రెండేళ్లుగా శిరీష్ ముఖ్యంగా ఈ రెండు అంశాల మీదనే ఫోకస్ పెట్టాడు. చాలా కష్టపడి, ఎక్స్‌పర్ట్స్ సమక్ష్యంలో శిక్షణ తీసుకుని గతంలో కంటే బెటర్ లుక్‌లోకి మారాడు.

ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి డైరెక్ట‌ర్ క్రిష్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన చేతుల మీదుగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ క్రిష్ మాట్లాడుతూ ప‌రుశురాం ఎప్పుడూ మంచి ఫ్యామిలీ చిత్రాల‌ను డైరెక్ట్ చేస్తుంటాడు. త‌న సినిమాల‌ను చూడ‌టానికి బాగా ఇష్ట‌ప‌డ‌తాను. ఈ క‌థ నాకు తెలుసు. మంచి ఎగ్జ‌యిటింగ్ స్టోరీ. ప‌రుశురాంలో మంచి ద‌ర్శ‌కుడే కాదు, మంచి ర‌చ‌యిత కూడా ఉన్నారు. నాకు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో ఒక పుష్ ఎలాగైతే వ‌చ్చిందో అలాంటి పుష్ త‌న‌కు కావాలి. శిరీష్‌, లావ‌ణ్య చ‌క్క‌గా క‌నిపిస్తున్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, చిరంజీవితో ప్లాన్ చేసిన ఫంక్షన్ వివరాలు మరియు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చాలా హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కనిపించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫోటోస్..

బన్నీ

ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు..

అల్లు అర‌వింద్

అల్లు అర‌వింద్

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్. ఇది మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న సినిమా అనో, మా అబ్బాయి న‌టించిన సినిమా అనో సినిమా బాగా వ‌చ్చింద‌ని చెప్ప‌డం లేదు. నిజంగాసినిమా చాలా బాగా వ‌చ్చింది' అన్నారు.

పరశురాం గురించి..

పరశురాం గురించి..

ద‌ర్శ‌కుడు ప‌రుశురాం సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేక్ష‌కులు ఏమాత్రం డిస‌ప్పాయింట్ కారు అని అల్లు అరవింద్ తెలిపారు.

చిరంజీవితో కొత్తగా ఈ ఫంక్షన్ ఏంటో?

చిరంజీవితో కొత్తగా ఈ ఫంక్షన్ ఏంటో?

ఈ నెల 31న ఓ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దానికి మెగాస్టార్ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజ‌రై శిరీష్‌ను ఆశీర్వ‌దిస్తారు అని అల్లు అరవింద్ తెలిపారు.

గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్

గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్

ద‌ర్శ‌కుడు ప‌రుశురాం మాట్లాడుతూ ``ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక అబ్బాయి లావ‌ణ్య‌లాంటి గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాల‌ని, ప్ర‌తి అమ్మాయి శిరీష్‌లాంటి బాయ్‌ఫ్రెండ్ కావాల‌నుకుంటారు`` అన్నారు.

లావ‌ణ్య మాట్లాడుతూ

లావ‌ణ్య మాట్లాడుతూ

``గీతాఆర్ట్స్ వంటి పెద్ద బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ చాలా మంచి కోస్టార్‌. డైరెక్ట‌ర్ ప‌రుశురాంగారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. థ‌మ‌న్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

శిరీష్

శిరీష్

అల్లు శిరీష్ మాట్లాడుతూ ``క‌థ‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ ఉన్న సినిమా. థ‌మ‌న్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇవ్వ‌గా, మ‌ణికంఠ‌న్‌గారు మంచి సినిమాటోగ్ర‌ఫీని అందించారు' అన్నారు.

సపోర్ట్

సపోర్ట్

ప్ర‌తి ఒక్క‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకోగ‌లిగాను. ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. సినిమా ఆగ‌స్టు 5న రిలీజ్ అవుతుందని శిరీష్ తెలిపారు.

నటీనటులు

నటీనటులు

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: తమన్.య‌స్‌.య‌స్‌, యాక్షన్ - రామ్, లక్ష్మణ్, ఆర్ట్ - రామాంజనేయులు, డిఓపి - మని కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- నాగ‌రాజు, ఎడిటర్ - మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత - అల్లు అరవింద్, దర్శకుడు - పరశురామ్.

శ్రీరస్తు శుభమస్తు

శ్రీరస్తు శుభమస్తు

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, పరుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కత్వంలో అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు.

క్రిష్

క్రిష్

ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైరెక్ట‌ర్ క్రిష్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

టైటిల్ సాంగ్

టైటిల్ సాంగ్

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదల చేశారు. స్లో బీట్ తో సాగే డ్యుయెట్ ఇది. సాంగ్ కు మంచి స్పందన వచ్చింది.

 శిరీష్

శిరీష్

ఇక శిరీష్ తన లుక్ మార్చుకోవడానికి పడ్డ కష్టం ఈ సాంగులో కనిపిస్తోంది. గతంలో కంటే బెటర్ లుక్ తో శిరీష్ ఆకట్టుకుంటున్నాడు.

లావణ్య హాట్

లావణ్య హాట్

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి గత సినిమాల కంటే చాలా హాట్ గా కనిపించబోతోంది.

ఇక్కడే ఇంత హాట్..

ఇక్కడే ఇంత హాట్..

ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలోనే అమ్మడు ఇంత హాట్ గా ఉందంటే... సినిమాలో ఇంకెంత హాట్ గా ఉంటుందో..

English summary
Check out Srirastu Subhamastu theatrical trailer launch event details. Starring Allu Sirish, Lavanya Tripathi , Prakash Raj , Directed by Parasuram ( Bujji ) , Produced by Allu Aravind Music By SS Thaman from the Production House of Geethaarts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu