twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి ఎఫెక్ట్: లైంగిక వేధింపులు.. ఇక అలాంటి వ్యవహారాలు సాగవ్, ఏం చేస్తున్నారో తెలుసా!

    |

    Recommended Video

    MAA Responded To Srireddy's Voice on Industry Culture

    శ్రీరెడ్డి వ్యవహారం ముదిరి పాకాన పడ్డ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నివారణ చర్యలు మొదలు పెట్టింది. కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికి అవకాశాలు, జూనియర్ ఆర్టిస్టులకు సెట్స్ లో కనీస సౌకర్యాలు వంటి విషయాలపై శ్రీరెడ్డి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పోరాటం సరైన దారిలో సాగకపోవడంతో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడం వంటి జరగకూడని ఘటనలు జరిగాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఏకమైన చిత్ర పరిశ్రమ చర్యలు చేపడుతోంది.

    ఆడిషన్స్ జరిగే సమయంలో

    ఆడిషన్స్ జరిగే సమయంలో

    కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మా అసోసియేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు జరుగుతుండడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇకపై ఆడిషన్స్ సిసి కెమెరాలు, మహిళ ఆధ్వర్యంలోనే జరిగేట్టుగా నిర్ణయం తీసుకున్నారు.

    ప్యానల్ నియామకం

    ప్యానల్ నియామకం

    లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఓ ప్యానల్ ని నియమించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్యానల్ లో ఇండస్ట్రీకి చెందిన వారు, బయటివారు 50 శాతం ఉండేట్లు నిర్ణయించారు.

    డైరెక్ట్ హాట్ లైన్

    డైరెక్ట్ హాట్ లైన్

    లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న ప్యానల్ లో షీటీమ్స్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరిలో డైరక్ట్ హాట్ లైన్ ఉంటుంది. దీని ద్వారా కంప్లైంట్ వచ్చిన వెంటనే వేగంగా స్పందిస్తారు.

    మహిళల కోసం ప్రత్యేక పాలసీ

    మహిళల కోసం ప్రత్యేక పాలసీ

    ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్ లలో పనిచేసే మహిళల సలహాలు తీసుకుని అందుకు తగ్గట్లుగా వారికోసం పాలసీని తయారు చేయనున్నారు. మహిళలకు వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తారు.

    కొత్తగా వచ్చే వారికి

    కొత్తగా వచ్చే వారికి

    ఇండస్ట్రీకి రావాలనుకునే వారికోసం ప్రత్యకంగా ప్యానల్ నియమించి వారి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. కాస్టింగ్ కౌచ్ వంటి వ్యవహహారాలకు ఎక్కువగా బలి అవుతోంది వర్తమాన నటులే. దీనితో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    English summary
    SriReddy effect on Tollywood film industry. MAA releases new policies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X