twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు చంపేస్తారో, గద్దలు నా మాంసం కోసం చూస్తున్నాయి.. శ్రీరెడ్డి ఎమోషనల్‌గా!

    |

    కాస్టింగ్ కౌచ్ పై కొన్ని నెలలుగా శ్రీరెడ్డి తన గళాన్ని వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. అవకాశాల పేరుతో సినీప్రముఖులు తనని వేధించారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న నిరసన చేపట్టి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడంతో శ్రీరెడ్డిపై ఒక్కసారిగా అందరిలో వ్యతిరేకత ఏర్పడింది. తీవ్ర విమర్శలని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయిన శ్రీరెడ్డి త్వరలో ఢిల్లీ వేదికగా తన పోరాటం ఉంటుందని చెబుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులని ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

    Recommended Video

    Sri Reddy Warnings To Telugu Comedy Shows
    ఎవరు చంపేస్తారో అనే భయం

    ఎవరు చంపేస్తారో అనే భయం

    తన తల్లిదండ్రులని ఉద్దేశించి శ్రీరెడ్డి మాట్లాడుతూ.. అమ్మానాన్నలకు క్షమాపణలు. నా పోరాటాన్ని ఆపలేను. వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయించి నా పోరాటాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. నన్ను ఎవరైనా చంపేస్తారేమో, కేసులో ఇరికిస్తారేమో అనేది మీ భయం.

     ఢిల్లీకి వెళుతున్నా

    ఢిల్లీకి వెళుతున్నా

    అమ్మా.. నేను ఢిల్లీకి వెళుతున్నా. ఈసారి నా గళం గట్టిగా వినిపిస్తా. సమాజంలో అమ్మాయిలంటే లోకువగా చూస్తున్నారు. అందుకే ఈ పోరాటం చేస్తున్నా అంటూ శ్రీరెడ్డి తెలిపింది.

    ఏ ఒక్కడిని వదిలిపెట్టను

    ఏ ఒక్కడిని వదిలిపెట్టను

    నేను మోసపోయిన తీరుగురించి నీ కళ్ళలోకి చూస్తూ చెప్పలేనమ్మా. అందుకే మొండిగా పోరాటం చేస్తున్నా. నీ జీవితం వీళ్ళ కాళ్ళ కింద నలిగిపోయింది. వీళ్ళని క్షమించను. నాలా చాలా మంది అమ్మాయిల జీవితాలు నలిగిపోతున్నాయి అని శ్రీరెడ్డి తెలిపింది.

    గద్దలు నా మాంసం కోసం

    ఒకవేళ ఈ పోరాటంలో నేను బలైపోతే ఏడవకండి అంటూ శ్రీరెడ్డి తన తల్లిదండ్రులని ఉద్దేశించి తెలిపింది. నా మాంసం కోసం 99 శాతం గద్దలు ఎదురుచూస్తున్నాయి అంటూ శ్రీరెడ్డి తెలిపింది.

     మీ పరువు తీస్తున్నందుకు

    మీ పరువు తీస్తున్నందుకు

    ఒకవేళ తాను ఈ పోరాటంలో బలైపోతే మీ పరువు తీస్తున్నందుకు సరైన శిక్ష పడిందని సంతోషించండి అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్ గా తన తల్లిదండ్రులని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    English summary
    SriReddy emotional message to her parents. She announces protest in Delhi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X