twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నాకేమైనా అయితే భాద్యత వారిదే, అతడిపై ప్రశంసలు!

    |

    టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శ్రీరెడ్డి చేసిన అర్థ నగ్న నిరసనతో ఆమె ఒక్కసారిగా జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనితో మా అసోషషన్ కూడా ఆమె డిమాండ్లకు కొంత వరకు తలొగ్గింది. ఆ తరువాత శ్రీరెడ్డికి విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల మద్దత్తుకూడా లభించింది. ఎప్పుడూ వికృత చేష్టలతో వార్తల్లో నిలిచే దర్శకుడు వర్మతో చేతులు కలిపిన శ్రీరెడ్డి అతడి సూచన మేరకు పవన్ కళ్యాణ్ ని, అతడి తల్లిని దుర్భాషలాడడంతో ఈ వ్యవహారం వేడెక్కింది. ఇందులో కుట్రలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ వర్మపై, కొన్ని మీడియా సంస్థలపై యుద్ధం మొదలుపెట్టారు. ఆ తరువాత సైలెంట్ అయిపోయిన శ్రీరెడ్డి తన సోషల్ మీడియా వేదికగా మాత్రం కొన్ని కామెంట్లు పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజగా ఆమె చేసిన పోస్ట్ ఆసక్తి కరంగా ఉంది.

    ఫోన్ కాల్ లో వైసిపి ప్రస్తావన

    ఫోన్ కాల్ లో వైసిపి ప్రస్తావన

    శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన తరువాత ఆమె స్నేహితురాలు ట్రాన్స్ జెండర్ తమన్నా తో జరిపి ఫోన్ సంభాషణ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ కాల్ లో శ్రీరెడ్డి టిడిపి, వైసిపి పేర్లు ప్రస్తావించింది. దీనితో ఈ కుట్ర వెనుక రాజీకయ రంగు ఉందనే అనుమానాలు మొదలయ్యాయి.

    పవన్ కళ్యాణ్ ఎంట్రీ

    పవన్ కళ్యాణ్ ఎంట్రీ

    తన తల్లిపై చేసిన వ్యాఖ్యలతో రగిలిపోయిన పవన్ కళ్యాణ్ ఈ కుట్రకు వ్యతిరేకంగా యుద్ధమే ప్రకటించారు.దీని వెనుక వర్మ, టివి9 రవిప్రకాష్, టివిశ్రీనిరాజు, నారాలోకేష్ ఉన్నారనే అనుమానంతో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ న్యాయపోరాటం మొదలు పెట్టారు.

    శ్రీరెడ్డి రాజకీయం మొదలు పెట్టిందా

    కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తానని చెప్పిన శ్రీరెడ్డి దృష్టి ఇప్పుడు రాజకీయాలపై పడ్డట్లు తెలుస్తోంది. తాజగా తన ఫేస్ బుక్ పేజీలో వైసిపి అధినేత జగన్ పై ప్రశంసల వర్షం కురిపించింది. జగన్ కి ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉందని శ్రీరెడ్డి తన పోస్ట్ లో పేర్కొంది. రౌడీ రాజకీయాలు చేసే వారిని వైసిపిలో కలుపుకోవద్దని శ్రీరెడ్డి సూచిందింది.

    సంచలన వ్యాఖ్యలు

    శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ గురించి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఏమైనా అయితే మెగా ఫ్యామిలీదే భాద్యత అంటూ సంచలన కామెంట్ పెట్టింది. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న వాంగ్మూలం అని శ్రీరెడ్డి పేర్కొంది. తన కెరీర్ కు, లైఫ్ కు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించింది.

    నేషనల్ మీడియాకు పిలుపు

    ప్రస్తుతం జరుగుతున్నా రౌడీ అకృత్యాలపై నేషనల్ మీడియా ఫోకస్ చేయాలని శ్రీరెడ్డి కోరింది. మీడియాపై దాడులు, ట్రోలింగ్ వంటి విషయాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

    నాగ బాబుకు హెచ్చరిక

    పనిలో పనిగా శ్రీరెడ్డి నాగబాబుపై కూడా వ్యాఖ్యలు చేసింది. కంపెనీ ఆర్టిస్టులకు ప్రకటించిన సాయం చాలా చిన్నది అని శ్రీరెడ్డి అభిప్రాయ పడింది. కానీ నాగబాబు గారు ఎదో గొప్పగా చేసినట్లు ఫీలవుతున్నారంటూ వ్యాఖ్యానించింది. దీనిని కూడా పోరాటం చేస్తానని తెలిపింది.

    అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు

    అమ్మాయిలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే వారికి నా సలహా అంటూ శ్రీరెడ్డి మరో పోస్ట్ పెట్టింది. వైఎస్ఆర్, ఎన్టీఆర్ వంటి నేతలు ఎంత ఉండగా ఉండే వారో వారి చరిత్ర చదివి తెలుసుకోవాలని శ్రీరెడ్డి సూచించింది.

    శ్రీరెడ్డిలో రాజకీయ కోణం

    శ్రీరెడ్డిలో రాజకీయ కోణం

    శ్రీరెడ్డి ఒకరోజు చెప్పిన మాటలకు మరో రోజు చెబుతున్న మాటలకూ పొంతన ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటంగా మొదలు పెట్టిన శ్రీరెడ్డి ఆ తరువాత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు, రాజకీయ పరమైన వ్యాఖ్యలతో నిలకడ లేని స్వవభావాన్ని బయట పెట్టుకుంది. దీని ద్వారా ఆమెపై మొదట్లో ఉన్నా సింపతీ ఇప్పుడు తగ్గిపోయిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    SriReddy sensational comments on Mega family. SriReddy praises YS Jagan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X