»   » అమ్మాయిల మనసుతో ఆటలొద్దు: కొడుకుతో షారుక్

అమ్మాయిల మనసుతో ఆటలొద్దు: కొడుకుతో షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోగా షారుక్ ఎప్పుడూ సినిమాలు, సినిమా ఫంక్షన్లతో బిజీగా గడుపుతుంటారు. అదే సమయంలో తండ్రిగా తన బాధ్యతలను పర్‌ఫెక్టుగా నిర్వహిస్తున్నాడు షారుక్. తన కొడుకు ఆర్యన్, కూతురు సుహానాలకు మంచి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం షారుక్ కుమారుడు ఆర్యన్ ఉన్నత చదువుల నిమిత్తం లండన్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ తన సూపర్ స్టార్ డాడీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఎంతో గౌరవంగా ఉండాలనే విషయాలు తెలుసుకున్నాడు. తన కుమారుడికి చెప్పిన ఈ విషయాల గురించి ఇటీవల షారుక్ మీడియాకు వివరించారు.

'ఏ అమ్మాయి మనసు కూడా నొప్పించకు, వారి గుండె బద్దలయ్యే పనులు చేయకు, వారి పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించు. మహిళల పట్ల అమర్యాదగా, దారుణంగా ప్రవర్తించకు. ఒక వేళ అలా చేస్తే నీ తల్లి దండ్రులు నిన్ను ఎప్పటికీ క్షమించరు' అంటూ తన కొడుకుకు మంచి బుద్దులు నేర్పించారట షారుక్.

ఇటీవల భారత దేశంలో మహిళల పట్ల అరాచకాలు పెరిగి పోతున్న నేపథ్యంలో....పిల్లలను చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా, మంచి బుద్దులతో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని షారుక్ వ్యాఖ్యానించారు. పిల్లలు చెడు మార్గంలో వెళ్లారంటే అది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యమే అంటున్నాడు కింగ్ ఖాన్.

English summary

 Talking to the media persons, Shahrukh Khan said that he teaches his son Aryan never to break a girl's heart. He further said that he wants Aryan to be gentle to girls. "I tell him - Don't break a girl's heart, treat her gently and there is no way that you can look at an atrocity done on a women and if you do that you will not be forgiven by your father and mother," SRK told the press.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu