»   » అతడితో సినిమా తీస్తా.. పది రోజులు డైలాగ్స్ వినపడకుండా అరుపులతో దద్దరిల్లుతుంది.. రాజమౌళి

అతడితో సినిమా తీస్తా.. పది రోజులు డైలాగ్స్ వినపడకుండా అరుపులతో దద్దరిల్లుతుంది.. రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చిత్రంలో ఒక సీన్‌లోనైనా కనిపించాలని ఏ హీరోనైనా కోరుకుంటారు. ఇక సినిమా అయితే బంపర్ లాటరీ తగిలినట్టు. బాహుబలి2 విడుదల తర్వాత జక్కన సినిమా ఎవరితో అనే చర్చ మొదలైంది. అయితే రాజమౌళి మాత్రం బాహుబలి సినిమా కాకుండా ఓ సింపుల్ మూవీ తీస్తాను అని ఇప్పటికే హింట్ ఇచ్చాడు. తాజాగా బాహుబలి2 ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీస్తాను అని ఓ మాట చెప్పాడు. కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

నాకు అలా అనడం ఇష్టం ఉండదు..

నాకు అలా అనడం ఇష్టం ఉండదు..

నాకు టాలీవుడ్, బాలీవుడ్ అనే పదాలు ఇష్టం ఉండదు. తెలుగు సినీ పరిశ్రమ, హిందీ సిని పరిశ్రమ, తమిళ సినీ పరిశ్రమ అనడమే నాకు చాలా ఇష్టం. ఇండియన్ సినిమా అని పిలువడం నాకు ఇష్టం ఉండదు అని రాజమౌళి పేర్కొన్నారు. హాలీవుడ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు. ఇండియాలోనే సినిమాలు తీస్తాను అని జక్కన తెలిపాడు

హాలీవుడ్ స్టయిల్‌కు సరిపోను..

హాలీవుడ్ స్టయిల్‌కు సరిపోను..

ఇటీవల అమెరికాలో పర్యటించాను. హాలీవుడ్‌లో సినీ నిర్మాణ శైలిని చూశాను. అక్కడ అనుసరిస్తున్న విధానాలు, నేను సినిమాలు తీసే పద్ధతికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే నేను హాలీవుడ్‌కు సరిపోను అని నిర్ణయించుకొన్నాను. ఇండియాలోనే ఉంటూ ఆ స్థాయి సినిమాలు తీస్తాను అని రాజమౌళి చెప్పాడు.

బాహుబలి అంటే ఇష్టం..

బాహుబలి అంటే ఇష్టం..

మగధీర, బాహుబలి సినిమాల్లో నాకు బాహుబలి అంటేనే ఇష్టమని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక ప్రభాస్, తారక్‌లో ప్రస్తుతం ప్రభాస్ అంటేనే ఇష్టం. కానీ స్నేహితుడిగా తారక్‌ను చాలా ఇష్టపడుతాను అని రాజమౌళి జవాబిచ్చారు.

అనుష్క కమిట్‌మెంట్ అంటే..

అనుష్క కమిట్‌మెంట్ అంటే..

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అనుష్క నా ఫేవరేట్. అనుష్క కమిట్‌మెంట్ నాకు చాలా నచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన విధంగా ఎవరూ చేయలేదు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది. నిర్మాత, దర్శకులకు విజన్‌కు తగినట్టుగా నటిస్తుంది రాజమౌళి చెప్పారు.

మర్యాద రామన్న అంటే..

మర్యాద రామన్న అంటే..

నేను తీసిన సినిమాలలో మర్యాద రామన్న చిత్రం నాకు చాలా ఇష్టం. మిగితా సినిమాల్లో మాయాబజార్, బ్రేవ్ హార్ట్ సినిమాలు నా ఫేవరేట్. నాకు నచ్చిన నటుల్లో బ్రూస్ లీ, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌ను ఇష్టపడుతాను. బ్రూస్‌లీ నటన అంటే నన్ను ఆకట్టుకొన్నది అని రాజమౌళి అన్నారు.

అరుపులతో దద్దరిల్లాలి..

అరుపులతో దద్దరిల్లాలి..

దక్షిణాదిలో రజనీకాంత్‌తో సినిమా చేయాలనుకొంటున్న దర్శకుల్లో నేను ఒకరిని. నేను రజనీతో ఎలాంటి సినిమా చేస్తానో తెలియదు. కానీ ఒకవేళ రజనీతో సినిమా చేస్తే కనీసం పదిరోజులు థియేటర్లలో డైలాగ్స్ ఏంటో అర్థం కావొద్దు. సినిమా మొదలైన దగ్గరి నుంచి సినిమా అయిపోయే దాకా ప్రేక్షకుల అరుపులు, కేరింతలతో సినిమా హాల్ దద్దరిల్లి పోవాలి అని రాజమౌళి తెలిపారు.

గరుడ సినిమా తీయాలని..

గరుడ సినిమా తీయాలని..

గరుడ అనే సినిమా ప్రస్తుతం నా మదిలో ఉంది. ఇంకా సినిమా స్క్రిప్ట్‌పై క్లారిటీ లేదు. ఇందులో మోహన్‌లాల్‌ నటిస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేను. కథ మొత్తం తయారయ్యాక సినిమా చేస్తాను. మోహన్‌లాల్ గొప్ప నటుడు, వీలు చిక్కితే ఆయనతో సినిమా తీయడం ఖాయం అని రాజమౌళి అన్నారు.

బాహుబలి2 పనుల్లో బిజీ..

బాహుబలి2 పనుల్లో బిజీ..

ప్రస్తుతం రాజమౌళి బాహుబలి2 విడుదల తర్వాత సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. లండన్‌లో బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సినిమాను ప్రదర్శించారు. ఫ్యామిలీతో టూర్‌ను లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తర్వాతే ఎవరితో సినిమా అనేది కొలిక్కి వస్తుందనే మాట వినిపిస్తున్నది.

English summary
As part of Baahubali2 promotion, Director Rajamouli interacted with students. He gives few interesting thoughts of him to stundent. If he do a film with Rajinikanth, That could become sensational in industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu