»   » రాజమౌళి భారీ ఫాంహౌస్ : ప్లానింగే బ్రహ్మాండంగా ఉంది

రాజమౌళి భారీ ఫాంహౌస్ : ప్లానింగే బ్రహ్మాండంగా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు టాలీవుడ్ లో ఏ నలుగురు కలిసినా చర్చ ఒకటే..అది రాజమౌళి..ఫామ్ హౌస్ గురించి. అందరికీ పల్లెటూళ్లో ఉంటూ రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. అయితే అక్కడ ఈ సిటీ సదుపాయాలు...అవకాసాలు ఉండవు. అందుకే కాస్త డబ్బున్నవాళ్లు, డబ్బువెనకేసినవాళ్లు ఫామ్ హౌస్ లు కట్టుకుంటూంటారు. ఇన్నాళ్లూ సెలబ్రిటీల్లో చాలా మందికి ఫామ్ హౌస్ లు ఉన్నా ఎక్కువగా వార్తల్లో కనిపించేది మాత్రం తెలంగాణా సీయెం కేసీఆర్.., సినిమా వాళ్ళలో పవన్ కళ్యాణ్ లు మాత్రమే. ఇప్పుడు ఇంకో ఫాం హౌస్ కూడా ఫేమస్ అవనుంది..

దోనకొండ సమీపంలో

దోనకొండ సమీపంలో

ఎస్.ఎస్.రాజమౌళి తెలంగాణ ప్రాంతమైన దోనకొండ సమీపంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దోనకొండ పరిసరాల్లో దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల భూమి కొన్నారాయన. రజాకార్ల ఉద్యమానికి కేంద్రమైన కట్టంగూర్ మండల కేంద్రం పరిసరాల్లో ఈ భూమి ఉందని చెబుతున్నారు.

మామిడి, సపోట తోటలు

మామిడి, సపోట తోటలు

రాజమౌళి కొన్న ల్యాండ్ సింగిల్ బిట్ ఫ్లాట్. 100 ఎకరాలు ఒకే చోట ఉంది. ఇందులో మామిడి తోటలు - సపోట తోటలు ఉన్నాయి. ఓ పశువుల కొట్టాం ఉంది. గోబర్ గ్యాస్ ప్లాంట్ ఉంది. ఇందులోనే ఫామ్ హౌస్ లో ఫ్యామిలీ సమేతంగా ఉండాలనుకుంటున్నారు రాజమౌళి. ఎన్ హెచ్ 9 రహదారికి చేరువలో ఈ భూములు ఉన్నాయి.

ప్లానింగ్ పూర్తి చేసారు

ప్లానింగ్ పూర్తి చేసారు

అందులో అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఫార్మ్ హవుస్ కట్టుకోవాలని అనుకుంటున్నారు. అందుకు ప్లానింగ్ పూర్తి చేసారు. ఇరవై ఎకరాల్లో తోటలు, పంటల చేలు, అందులోనే ఓ చిన్న విలేజ్ మాదిరిగా ఒకటి రెండు చిన్న ఇళ్లు..ఓ పెద్ద ఇల్లు డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.

ఆర్ట్ డైరక్టర్ రవీందర్

ఆర్ట్ డైరక్టర్ రవీందర్

ఇక నిర్మాణం మొదలు పెట్టడమే తరువాయి. రాజమౌళికి అత్యంత ఆప్తుడు, ఇష్టుడు అయిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ మొత్తం ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా, దారులు, ఇలాంటివి కూడా ఈ డిజైన్ లో వుంటాయని తెలుస్తోంది. సిటీ కాలుష్యం బారినుంచి తప్పించుకోవటానికి రాజమౌళి ఓ ఫామ్ హౌస్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇంట్రస్టింగ్ న్యూస్

ఇంట్రస్టింగ్ న్యూస్

వచ్చే సంవత్సరం ప్రారంభానికి ఆ ఫామ్ హౌస్ లోరాజమౌళి కుటుంబం గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. మరి రాజమౌళి అఫీషియల్ గా ఆ ఫామ్ హౌస్ గురించి మనకు ఎప్పుడు చెప్తారోమరి..ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇంకో ఇంట్రస్తింగ్ న్యూస్ వినిపిస్తోంది...

దోనకొండలో ఫిలిం ఇండస్ట్రీ

దోనకొండలో ఫిలిం ఇండస్ట్రీ

అసలు ఫామ్ హౌస్ కట్టాలనుకుంటున్నది సిటీ శివార్లలో అనీ, దోనకొండ భూముల సంగతి వేరే అనీ ఇంకోటాక్. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి దోనకొండలో ఫిలిం ఇండస్ట్రీ నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నారు. అక్కడ 5వేల ఎకరాల్ని ఆయన సినీపరిశ్రమ కోసం కేటాయించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఇంట్రెస్టింగ్. దోనకొండని సినిమా హబ్ గా మార్చే ప్లాన్ లో భాగమేనా అన్న చర్చలూ టాలీవుడ్ లో చిన్నగా వినిపిస్తున్నాయి.

కీరవాణి, సాయి కొర్రపాటి

కీరవాణి, సాయి కొర్రపాటి

ఈ వార్తకు బలం చేకూర్చే ఇంకో విషయం కూడా ఏమిటంటే రాజమౌళి ఫార్మ్ కు పక్కనే ఆయన కుడి ఎడమల్లాంటి కీరవాణి, సాయి కొర్రపాటి లకు కూడా ఇరవై, డెభై ఎకరాల తోటలు వున్నాయి. రాజమౌళి అంటేనే వైవిధ్యమైన సెట్ లకు , విజువల్స్ కు పెట్టింది పేరు. మరి ఆయన ఫామ్ హవుస్ అంటే మరి ఎలా వుంటుందో?

English summary
SS Rajamouli is now planning to built a huge farm house with the 20 acres of land he has on the outskirts of Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu