»   » ‘బాహుబలి’ భద్రత కోసం ఇలా...(ఫోటో)

‘బాహుబలి’ భద్రత కోసం ఇలా...(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. అత్తారింటికి దారేది చిత్రం పైరసీకి గురి అవటంతో అలాంటి ప్రమాదం తమ సినిమాకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి ఓ సెక్యూరిటి డివైజ్ ని తయారు చేయించారు. ఈ విషయమై రాజమౌళి ట్వీట్ చేస్తూ ఫోటో కూడా పెట్టారు..(మీరు ప్రక్కన చూస్తున్న ఫోటో అదే...). డిజిటిల్ కెమెరాలపై షూట్ చేస్తున్న ఈ చిత్రం డేటా ని ఆన్ లైన్ స్టోరేజ్ బ్యాకప్ సిస్టమ్ ద్వారా భద్రపరుస్తారు.

ఇక తన సినిమాలకు ప్రచారం కల్పించడానికి వెరైటీ మార్గాలను అన్వేషించే దర్శకుడు రాజమౌళి బాహుబలి విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. గతంలో విడుదలకు ముందే 'ఈగ' మూవీ స్టోరీని లీక్ చేసిన రాజమౌళి ఈ సారి బాహుబలి చిత్రం మేకింగ్ వీడియోలను దఫదఫాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. 'బాహుబలి' చిత్రం తొలి మేకింగ్ వీడియోను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ మేకింగ్ వీడియో ఒక నిమిషం నిడివితో ఉంటుందని సమాచారం.

సినిమాపై అంచాలు పెంచే విధంగా ఈ మేకింగ్ వీడియో ఉంటుందని అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.....అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.

తన కెరీర్లో ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సినిమా కోసం పడుతున్నాడు ప్రభాస్. యుద్ద విద్యలు, గుర్రం స్వారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దీని తర్వాత తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

సినిమా కోసం ఫిల్మ్ సిటీలో దాదాపు రూ. 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Rajamouli is the first who is taking special care on security for his is undergoing prestigious huge budget film “Bahubali”. Rajamouli already given a statement, he will take extra care for Bahubali Video Data and VFX.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu