»   » ఇద్దరు సూపర్‌స్టార్లతో రాజమౌళి మల్టీస్టారర్.. జక్కన్న మళ్లీ సెన్సేషనల్ ప్రాజెక్ట్?

ఇద్దరు సూపర్‌స్టార్లతో రాజమౌళి మల్టీస్టారర్.. జక్కన్న మళ్లీ సెన్సేషనల్ ప్రాజెక్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి సినిమా ఏంటనే విషయంపై ఉత్కంఠ వీడటం లేదు. తన తదుపరి చిత్రంపై రాజమౌళి సస్పెన్స్‌ అలాగే కొనసాగిస్తున్నాడు. బాహుబలి సినిమాకు ముందే డీవీవీ దానయ్యకు సినిమా కమిట్ అయ్యాడనే వార్తలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. అయితే రాజమౌళి తీయబోయే సినిమా ఏమిటీ? హీరో ఎవరు? ఎప్పుడు మొదలుపెడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకడం లేదు. తాజాగా ఓ రూమర్ ఫిలింనగర్ వైరల్ అవుతున్నది.

మల్టీస్టారర్ చిత్రంపై జక్కన్న దృష్టి

మల్టీస్టారర్ చిత్రంపై జక్కన్న దృష్టి

బాహుబలి అనంతరం రాజమౌళి తీయబోయే సినిమా మల్టీ స్టారర్ చిత్రమనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సూపర్‌స్టార్లను ఒకే తెరమీద చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. వారిద్దరికి తగినట్టు పాత్రలను డిజైన్ చేస్తున్నారనే మాట మీడియాలో వినిపిస్తున్నది.

ప్రిన్స్ మహేశ్, ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా

ప్రిన్స్ మహేశ్, ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా

తాజా మీడియా రిపోర్ట్ ప్రకారం రాజమౌళి తదుపరి చిత్రంలో ప్రిన్స్ మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తారనేది వార్త సారాంశం. జక్కన తదుపరి చిత్రం తారక్‌తోనే ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, మహేశ్ పేరు తెరపైకి రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

రాజమౌళి సినిమాపై ప్రిన్స్ మహేశ్ ఆసక్తి

రాజమౌళి సినిమాపై ప్రిన్స్ మహేశ్ ఆసక్తి

బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలో నటించేందుకు ప్రిన్స్ మహేశ్‌బాబు ఆసక్తి చూపిస్తున్నారనేది మీడియా ద్వారా స్పష్టమైంది. బాహుబలి2 చిత్రం తర్వాత రాజమౌళిపై ప్రిన్స్ మహేశ్ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు.

మళ్లీ భారీ బడ్జెట్ చిత్రమేనట.

మళ్లీ భారీ బడ్జెట్ చిత్రమేనట.

కాగా, బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమాతో ముందుకెళ్లాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ స్థాయి చిత్రం కాకుండా మీడియం రేంజ్ సినిమానే చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ మారిన ఆలోచన ప్రకారం భారీ బడ్జెట్ చిత్రమయ్యే అవకాశం కనిపిస్తున్నది.

మళ్లీ సెన్సేషన్ ప్రాజెక్ట్‌కు ప్రయత్నాలు..

మళ్లీ సెన్సేషన్ ప్రాజెక్ట్‌కు ప్రయత్నాలు..

ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోపై దృష్టిపెట్టినట్టు వార్తలు రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ మూవీ కావడం తథ్యం అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

English summary
After Baahubali, Director Rajamouli is get ready with next project. As per reports, Rajamouli is committed to a movie for Producer DVV Danayya. And for this project, He is working on multi starrer movie. That could be casting Prince Maheshbabu and Jr.NTR same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu