»   » మెగాస్టార్ 150 మూవీ ప్రాజెక్టులో.... రాజమౌళి కొడుకు కూడా!

మెగాస్టార్ 150 మూవీ ప్రాజెక్టులో.... రాజమౌళి కొడుకు కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా భాగం కాబోతున్నాడు. కార్తికేయ తన టీంతో కలిసి ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు రూపొందించే కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి 150వ సినిమాను తన దక్కిన అతిపెద్ద అవకాశంగా భావిస్తున్న కార్తికేయ.... తనదైన స్టైల్ లో సరికొత్తగా మేకింగ్ వీడియోలు రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా పబ్లిసిటీలో మేకింగ్ వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

SS Rajamouli's son Karthikeya for Chiru 150th

బాహుబలి సినిమా సమయంలో మేకింగ్ వీడియోలు, వివిద పాత్రలను పరిచయం చేస్తూ రిలీజైన క్లిప్స్ కు మంచి స్పందన వచ్చింది. అవి అంత బాగా రావడంలో కార్తికేయ అండ్ టీం భాగస్వామ్యం కూడా ఉంది. తర్వాత పలు తెలుగు సినిమాలకు కార్తీకేయ అండ్ టీం ఇలాంటి మేకింగ్ వీడియో కాంట్రాక్టులు దక్కించుకుని మంచి పేరు తెచ్చుకున్నారు.

కార్తికేయ టాలెంట్ చూసి ముచ్చటపడ్డ రామ్ చరణ్ 'ఖైదీ నెం.150' సినిమా మేకింగ్ వీడియోల బాధ్యతను కార్తికేయకు అప్పజెప్పాడట. మరి కార్తికేయ తనకు అప్పజెప్పిన బాధ్యతను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

English summary
Ace director SS Rajamouli's son Karthikeya is part of megastar Chiranjeevi's 150th film Khaidi No 150. Karthikeya and his team has been working on 'Making Videos' for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu