twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న సినిమాపై చంద్రబాబు వరాల జల్లు!

    |

    చిన్న సినిమాపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ 4 కోట్ల లోపు బడ్జెట్ లో నిర్మించే చిత్రాలని ఏపీ ప్రభుత్వం చిన్న చిత్రాలుగా పరిగణించనుంది. ఈ చిత్రాలకు స్టేట్ జీఎస్టీ నుంచి కల్పిస్తారు.

    దీనికోసం చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన నిబంధన ఏంటంటే.. ఆయా చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆంధ్రప్రదేశ్ లోనే చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. రాబోవు రోజుల్లో ఆయా చిత్రాలకు షూటింగ్ లొకేషన్లు ఉచితంగా ఇస్తామని కూడా ప్రకటించింది.

    State GST exemption for telugu cinema in AP

    తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా తీసే ప్రతి పది చిత్రాలని ఎంపిక చేసి వాటికీ ప్రోత్సాహకాలు ప్రతి ఏడాది అందిస్తామని కూడా ప్రకటించారు. తెలుగు సినిమాకు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ని కూడా తెలుగు సినిమాకు అడ్డాగా మార్చాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    English summary
    State GST exemption for telugu cinema in AP. Here is the conditions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X