twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లెజెండ్‌' షోలు ఆపేయండి

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షోలు ఆపేయండని అనంతపురం కలెక్టరకు వినతి పత్రం అందచేసారు. వైఎస్ ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి, కో ఆర్డినేటర్ ఆదినారాయణ శనివారం రాత్రి కలెక్టర్ లోకేషన్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందచేసారు.

    ఆ సినిమా హీరో బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్దిగా ప్రకటించిన నేపధ్యంలో ఓటర్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే లెజండ్ సినిమా టీడీపి కి అనుకూలంగా ఉందని, అందులో డైలాగులు ఆ పార్టికి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణాలో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ...తెలుగుదేశం అభ్యర్ది బాలకృష్ణ అని తమకు బీ ఫాం అందాక ఈ కంప్లైంట్ ని పరిశీలిస్తామని అన్నారు.

     Stop Balakrishna's Legend Movie:YSRP

    మరో ప్రక్క నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేయడంపై అభిమానులు సంబరాలు చేసుకున్నారు. నందమూరి కుటుంబం రుణం తీర్చుకుంటాం అంటూ విజయ చిహ్నాన్ని చూపారు. ఎన్‌బీకే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కేక్‌ కోసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అప్పట్లో సినిమాలతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ పేదల కోసం తెదేపా స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చారన్నారు. బాలకృష్ణ నటనతోనూ, సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతూ తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం అన్నారు.

    నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేయనున్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ స్థానం నుంచి రంగంలో దిగనున్నారు. ఈ నెల 16న నామినేషన్‌ వేసే అవకాశాలున్నాయి. బాలకృష్ణ శనివారం చంద్రబాబునాయుడి నివాసానికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న హిందూపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, జిల్లా నేతలు ఆయనను హిందూపురం నుంచి పోటీచేయాలని కోరారు. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన బాలయ్య సరేనన్నారు.

    జై బాలయ్య, జై చంద్రబాబు నినాదాలతో కొద్దిసేపు సందడి నెలకొంది. అక్కడికొచ్చిన పార్టీనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, కోడెల శివప్రసాద్‌, సీఎం రమేష్‌ తదితరులంతా ఆయనకు అభినందనలు తెలిపారు. అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...'హిందూపురం నుంచి మీరు పోటీచేస్తే...మీ గాలి మాకు తగిలితే చాలు. మాకూ బ్రహ్మాండంగా ఉంటుంది'అని అన్నారు. మరోవైపు హరికృష్ణ కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా? అన్న చర్చ కూడా నడుస్తోంది.

    English summary
    Ananthapuram YSRP leaders asked Collector to Stop Legend Movie. Actor turned politician Nandamuri Balakrishna is looking forward to contest in the upcoming elections. His recent outing Legend has given him the much needed thrust and in the current political scenario, even fans have been wanting to him to come into active politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X