»   » ఆటోడ్రైవర్ ప్రేమకథే పత్తి కుచ్చి..... గోళీ సోడా గా రానున్న మరో తమిళ హిట్

ఆటోడ్రైవర్ ప్రేమకథే పత్తి కుచ్చి..... గోళీ సోడా గా రానున్న మరో తమిళ హిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిలీపన్‌, అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఏ.ఆర్. మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో ఏ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'. తమిళ్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి 'గోలీసోడా' పేరుతో తెలుగులో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనెలలోనే రిలీజ్‌కి రెఢీ అవుతోంది.

Story of Auto Drivers real storry patti kutchi dubbed in telugu as Goli Soda

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ సోదరుడు దిలీపన్ నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మురుగదాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.కిన్‌స్లిన్ దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాం. ఓ ఆటోడ్రైవర్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన చిత్రమిది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

జయప్రకాష్, జగన్, సతీష్, అఖిల్‌కుమార్, శరణ్య, పోన్‌వన్నన్, రాజశ్రీ, అంగనారాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: ఆర్.బి. గురుదేవ్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఎల్.బి. శ్రీకాంత్.

English summary
Golisoda film is Directed by P Kinslin and Produced by Venkatrao Marturi. Presented by Latha Marturi under JV Productions. Vathikuchi tamil film dubbed in telugu titled Golisoda. Dileepan, Anjali in lead roles
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu