»   » చిరు, పవన్ సినిమా కథ రెడీ.. త్వరలోనే త్రివిక్రమ్ చిత్రం సెట్స్ పైకి.. వివరాలు ఇవే..

చిరు, పవన్ సినిమా కథ రెడీ.. త్వరలోనే త్రివిక్రమ్ చిత్రం సెట్స్ పైకి.. వివరాలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ సినిమా వస్తున్నదంటూ వచ్చిన వార్తలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో హల్ చల్ చేశాయి. ఈ సినిమాను ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమా కథ సిద్ధమైనట్టు సుబ్బిరామిరెడ్డి వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు త్రివిక్రమ్, పవన్‌తో సుబ్బిరామిరెడ్డి ఇటీవల సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించినట్టు తెలుస్తున్నది.

అభిమానులకు పండుగ..

అభిమానులకు పండుగ..

తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలు రావడం చాలా తక్కువ. అందుకు కారణం హీరోల మధ్య చాలా ఇమేజ్ సమస్యలు ఉంటాయి. తమ హీరోకి పాత్ర పరిధి తక్కువగా ఉంటే అభిమానులు భరించలేరు. ఫ్యాన్స్ చేసే గొడవలు తట్టుకోలేక మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు జంకుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నదంటే ఇక అభిమానులకు పండుగే. వీరి కాంబినేషన్ టాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కావడం తథ్యం అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

సుబ్బిరామిరెడ్డి ప్రయత్నం..

సుబ్బిరామిరెడ్డి ప్రయత్నం..

ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఒకే తెరపై చూడాలని సినీ అభిమానులు ఉవ్విలూరుతున్నారు. వీరిద్దరిని కలిసి నటించేలా చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. కథ అనుకున్న విధంగా రాకపోవడంతో పలు ప్రయత్నాలు ఆచరణ సాధ్యం కాలేదు. తాజాగా సుబ్బిరామిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. గతంలో చిరంజీవితో స్టేట్ రౌడీ అనే చిత్రాన్ని సుబ్బిరామిరెడ్డి నిర్మించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ చిత్రం సంచలన విజయం సాధించింది.

మెగా బ్రదర్స్‌తో చర్చలు

మెగా బ్రదర్స్‌తో చర్చలు

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ తగినట్టుగా కథ సిద్ధం కావడంతో ఆ చిత్రాన్ని సెట్‌పైకి తీసుకెళ్లే పనిలో సుబ్బిరామిరెడ్డి బిజీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవల మెగా బ్రదర్స్‌తో సుబ్బిరామిరెడ్డి చర్చలు జరిపినట్టు కూడా తెలిసింది. సుబ్బిరామిరెడ్డి ప్రతిపాదనలకు మెగా బ్రదర్స్ నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం.

పవన్, త్రివిక్రమ్‌ను కలిసిన సుబ్బిరామిరెడ్డి

పవన్, త్రివిక్రమ్‌ను కలిసిన సుబ్బిరామిరెడ్డి

హారిక, హాసిని క్రియేషన్స్ సినిమా సెట్లో పవన్, త్రివిక్రమ్‌తో నిర్మాత, పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా బ్రదర్స్ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం చిరంజీవి, పవన్ కల్యాణ్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే నా సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని అన్నారు.

భారీ ఎత్తున సెట్స్ పైకి..

భారీ ఎత్తున సెట్స్ పైకి..

మెగా బ్రదర్స్ నటించబోయే సినిమాను టాలీవుడ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా, కనివినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ప్రారంభించేందుకు సుబ్బిరామిరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాను తెలుగు సినిమా పరిశ్రమలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌గా మలిచేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా మెగా బ్రదర్స్‌ను ఒకే తెరపై చూడాలన్న చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత సుబ్బిరామిరెడ్డికి దక్కడం గొప్ప విషయమే కదా..

English summary
Producer T Subbarami Reddy met Pawan Kalyan and Trivikram on the sets of their current movie produced by Haarika Haasine Creations. After meeting he said: I am happy to share that the mega combination will soon be hitting the floors. Both Megastar Chiranjeevi and Pawan Kalyan are now busy with their commitments. Once they finish it off, I will be launching the movie on a grand scale. It is going to be biggest movie of all in Telugu movie industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu