»   » పవన్‌తో డైవోర్స్‌కు బలమైన కారణం.. ఆత్మకథలో వివరిస్తా..

పవన్‌తో డైవోర్స్‌కు బలమైన కారణం.. ఆత్మకథలో వివరిస్తా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకొన్నా ఇంకా ఆయన జ్క్షాపకాల్లోనే జీవిస్తున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్‌ నుంచి రేణు విడిపోయి పిల్లలతో కలిసి పుణెలో నివసిస్తున్నది.

సినిమాలతో బిజీ.. తాత్కాలికంగా బ్రేక్

సినిమాలతో బిజీ.. తాత్కాలికంగా బ్రేక్

విడిపోయిన తర్వాత సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంది. రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది. అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది.

పవన్ కల్యాణ్ నా గురువు

పవన్ కల్యాణ్ నా గురువు

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌తో ఉన్న రిలేషన్స్ గురించి వివరించింది. ‘పవన్‌‌ కల్యాణ్‌కు దూరమైన ఆయన నాకు ఎప్పుడూ గురువే. ఇప్పటికీ ఆయనతో కలిసి బయట తిరుగుతుంటాను అని ఆమె వెల్లడించింది.
‘ఇంత క్లోజ్‌గా ఉంటున్నారు కదా.. మరి, విడాకులు ఎందుకు తీసుకున్నారు' అని నా స్నేహితులు అడుగుతుంటారు.

విడిపోవడానికి బలమైన కారణాలు

విడిపోవడానికి బలమైన కారణాలు

అయితే పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ప్రస్తుతం చెప్పలేను. వాటిని నేను త్వరలో రాయబోయే ఆత్మకథలో వివరిస్తాను. పవన్‌తో విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడిస్తాను అని రేణుదేశాయ్ చెప్పింది.

పెళ్లి, విడాకులు తొందరపాటు నిర్ణయాలు

పెళ్లి, విడాకులు తొందరపాటు నిర్ణయాలు

జీవితంలో తాను తీసుకొన్న తొందరపాటు నిర్ణయాల్లో పవన్ కల్యాణ్‌తో పెళ్లి, విడాకులు ఒకటని ఆమె తెలిపారు. పవన్ కల్యాణ్‌తో విడిపోవడానికి అవే కారణాలన్నీ మీడియాలో కథనాలు వచ్చినా.. రేణుదేశాయ్ వెల్లడించే విషయంతోనే ఓ స్పష్టత రావడం ఖాయం.

English summary
Renu desai Said, There is are strong reasons behind divorce with Pawan Kalyan. I will clear soon the reason in my autobiography.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu