»   » ''అ .... ఆ '' పైరసి చేసి ఫేస్ బుక్ లో పెట్టిన వ్యక్తి అరెస్ట్, వివరాలు

''అ .... ఆ '' పైరసి చేసి ఫేస్ బుక్ లో పెట్టిన వ్యక్తి అరెస్ట్, వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అత్తారింటికి దారేది తరహాలోనే త్రివిక్రమ్ తాజా చిత్రం అ...ఆ కూడా పైరసీ బారిన పడింది. అయితే వెంటనే టీమ్ ఎలర్టవటంతో డ్యామేజ్ జరగలేదు. అయితే ఈ విషయమై వెంటనే కేసు పెట్టడం, ఆ పైరసీదారుడ్ని అరెస్ట్ చేయటం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిన్న గురువారం విడుదలైన ''అ .... ఆ '' చిత్రాన్ని యుఎస్ లో చూస్తున్న ఓ స్టూడెంట్ నేరుగా దాన్ని పైరసీ చేస్తూ పేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసాడు. దాంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసారు .

Nitin

చికాగో లోని మువికో రోజ్ మాంట్ లో ''అ ..... ఆ '' ప్రీమియర్ షో చూస్తున్న ఓ ఇండియన్ స్టూడెంట్ ఈ పనిచేసాడు. సినిమా చూస్తూ పేస్ బుక్ ద్వారా ఆ వీడియో అంతా పెట్టడంతో హైదరాబాద్ లోని యాంటీ పైరసీ సెల్ త్వరగా స్పందించి అక్కడి థియేటర్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేసింది .

దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు స్టూడెంట్ ని అరెస్ట్ చేసారు . ఇక సినిమా కొంత భాగమే పైరసీ అయునప్పటికి ఆ లింక్ లన్నీ ఏవి లేకుండా డిలీట్ చేసారు . మొదటి రోజే ఇలా పైరసీ బారిన పడటంతో ఇప్పుడు పూర్తి స్దాయి జాగ్రత్తలోకి దిగారు.

ఇక చిత్రం తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం...ఆంధ్రా,సీడెడ్ లలో స్లోగా ఉంది. కానీ నైజాం లో మాత్రం దాదాపు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇక్కడ తెలంగాణా ఆవిర్బావ దినోత్సవం శెలవు కలిసి వచ్చింది.

అలాగే సినిమా ఎ,మల్టిఫ్లెక్స్ లలో బాగా నడిచేటట్లు ఉందని, బి,సి సెంటర్లు కొద్దిగా కష్టమే అని చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా నష్టపోయేదమి ఉండదని, ఈ వీకెండ్ లో ఆంధ్రా సైడ్ కూడా కలెక్షన్స్ పికప్ అవుతాయని బావిస్తున్నారు.

అలాగే మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు వినిపిస్తోంది. జీ తెలుగు ఛానల్ దాదాపు 6.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ సినిమా ప్రసార హక్కుల్ని సొంతం చేసుకుందట. నితిన్ నటించిన సినిమాలకు ఇంత మొత్తంలో శాటిలైట్ ధర పలకడం ఇదే తొలిసారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

English summary
A student from Valparaiso University, Indiana was arrested for recording A…Aa movie and streaming live in Facebook. This student was watching Premiere show yesterday in Muvico Rosemont, Chicago started recording and streaming the movie for couple of minutes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu