»   »  ఏం జరిగింది..? మెగా కాంపౌండ్ బయటికి అల్లు అర్జున్

ఏం జరిగింది..? మెగా కాంపౌండ్ బయటికి అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాభిమానులు అంటే అల్లు అభిమానులు కూడ అన్నట్టుండేది ఇదివరకు... చిరంజీవి దగ్గర నుంచి సాయి ధరమ్ తేజ వరకు ఇంతమంది నటులు స్క్రీన్ మీదకు వచ్చి హల్ చల్ చేయడానికి మూల కారణం. ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేసే మెగా ఫ్యామిలీ సినిమాలకు శ్రీరామరక్ష.

అలాంటి ఫ్యాన్స్ ఇప్పుడు కనీసం లో కనీసం రెండు వర్గాలుగా చీలిపోతున్నారు. కొణిదెల ప్యామిలీ ఫ్యాన్స్, అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ గా విడిపోతున్నారు. ఇప్పటికి చాలా కాలం ముందే మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరన్నట్లు తయారైంది పరిస్తితి..

సరైనోడు హిట్ తరువాత ఈక్వేషన్లు మారినట్లు కనిపిస్తున్నాయి. మెగా హీరోలు వేరు, అల్లు హీరో వేరు అన్నట్లు వుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఇలాంటి సమయంలో విజయవాడ సంఘటన ఈ మొత్తం వ్యవహారానికి ఆజ్యం పోసింది. చిరంజీవి పట్ల గౌరవం అభిమానం, అపరిమితంగా ప్రకటించిన బన్నీ అదే వేదిక పై పవర్ అభిమానులు కోరికను మాత్రం తిరస్కరించాడు. 'చెప్పను బ్రదర్' అని నిర్మొహమాటంగా అనేసాడు.

Stylish Star Allu Arjun Moving Out Of Mega family?


సరైనోడు విజయంతో మంచి జోరుమీదున్న అల్లు అర్జున్, ఇప్పుడు సొంతంగా తన బ్రాండ్ ను క్రియేట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ అంటే మెగా హీరోనే అనే ఇమేజ్ ఉంది. ఎలాంటి సక్సెస్ సాదించిన కూడా అది మెగా హీరో అనే బ్రాండ్ లోకి చేరుతుంది.

దాంతో ఇప్పటికే సొంతంగా ఓ బ్యానర్ ను కూడా పెట్టి తానకు నచ్చిన సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు, దాంతో పాటు మెగా హీరో ఇమేజ్ నుండి బయటకు వచ్చి సొంతంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు, అందులో బాగంగా చేసిందే .. సరైనోడు సినిమా .మాస్ ఇమేజ్ తో జనాల్లోకి వెళ్ళాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే మెగా హీరో అని కాకుండా అల్లు హీరో అనిపించుకునేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.

దీనికి సపోర్ట్ చేస్తూ ఈ మధ్యనే "అఖిల భారత అల్లు సంఘం" కు అంకురార్పణ జరిగింది. కేవలం అల్లు హీరోల మీద అభిమానం మీదే ఈ ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఏర్పడటం జరిగింది. దీనికి అల్లు అర్జున్, శిరీష్ ల అండదండలు అందుతున్నాయట. అయితే మెగా ఫ్యామిలీ క్రేజ్ తోనే ఇన్నాళ్లు హీరోగా రాణించిన బన్నీ ఇప్పుడు సెపరేట్ గా తనకంటూ ఒక ఇమేజ్ కోరుకుంటున్నాడు.

English summary
Bunny is looking to create a own fan base for himself coming out of the shadow of Chiranjeevi and Mega family.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu