»   » అల్లు అర్జున్ క్యూట్ విషెస్... పాప ఫొటోతో ఇలా

అల్లు అర్జున్ క్యూట్ విషెస్... పాప ఫొటోతో ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిపబ్లిక్ డే సందర్భంగా అల్లుహీరో బన్నీ ముచ్చటైన ట్వీట్ చేశాడు. ఎప్పుడూ సొషల్ మీడియాలో టచ్ లో ఉండే అల్లు అర్జున్ ప్ర్తీ స్పెషల్ డే కీ తనదైన శైలి లో ట్వీట్ చేయటం ట్విటర్ ని ఫాలో అయ్యే అల్లు , మెగా ఫ్యాన్స్ కి తెలిసిందే. అయితే ఈసారి రిపబ్లిక్ డేకోసం స్టైలిష్ స్టార్ చేసిన ట్వీట్ మరింత ముద్దొచ్చేలా ఉంది. ఇంతకీ అల్లు హీరో చేసిన ట్వీట్ ఏమిటో తెలుసా..

తన ఇంట్లోకి మహాలక్ష్మిలా ప్రవేశించిన ఆడబిడ్డ ముచ్చటను, టాలీవుడ్ టాప్ హీరో అల్లుఅర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే గణతంత్ర దినోత్సవం సందర్భంగా బన్నీ తన కూతురు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు. తన ముద్దుల తనయ అర్హా తరపున రిపబ్లిక్ డే స్పెషల్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు. తన బంగారు పాప క్యూట్ ఫోటో ను కూడా పోస్ట్ చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ అల్లు బేబి ఫోటోకి లైక్ ల వర్షం కురుస్తోంది.

Stylish Star Allu Arjun Republic Day Wishes

అర్హ అంటే హిందూ ప్రకారం 'లార్డ్ శివ 'అని,ఇస్లామిక్ ప్రకారం అర్హ అంటే 'ప్రశాంతత మరియు నిర్మలమైన'అని అర్ధాలు ఉన్నాయని తెలిపాడు.అంతే కాదు తన పేరులోని మొదటి రెండు ఆంగ్ల అక్షరాలు' ఏఆర్'ను..తన శ్రీమతి పేరు లోని స్నేహ లోని 'హెచ్ ఏ 'లను తీసుకొని'ఏఆర్ హెచ్ ఏ'... తెలుగులో 'అర్హ' గా పేరుపెట్టారు. అన్న విషయం తెలిసిందే కదా.. ముద్దులొలికే అర్హ ఫొటోనీ... అర్హ విషెస్నీ ఇక్కడ చూడండి.

English summary
Happy Republic Day ! Spl wishes from ALLU ARHA ! Stylish Star Allu Arjun Republic Day Wishes with His Doughter Pic On His Twitter Wall
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu