»   » అప్పుడు కమేడియన్ హీరో అయ్యాడు ఇప్పుడు విలన్ హీరో...

అప్పుడు కమేడియన్ హీరో అయ్యాడు ఇప్పుడు విలన్ హీరో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుబ్బరాజు హీరోగా శ్రీ కమలాలయ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. సూపర్ గుడ్ ఫిల్మింస్ సంస్థలో పలు చిత్రాలకు పనిచేసిన పోకూర శ్రీదర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతన్నారు. బెంగాలీలో పేరొందిన హీరోయిన్ దీప్తీ ప్రియ ఈ చిత్రకథానాయిక. ఈ చిత్ర కథను దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ 'ప్రస్తుతం సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, అక్రమాలకు సంబంధించిన సమస్యలను, వాటిపై మహిళలు జరిపే పోరాటాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం" అన్నారు.

చిత్ర నిర్మాత ఎస్ వి ఎస్ రావు ప్రోగ్రెస్ ను వివరిస్తూ 'విజయదశమి రోజున చిత్రం షూటింగ్ ప్రారంభించాం. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ తో యాభై శాతం టాకీ పార్ట్ పూర్తయింది. ఒక ముఖ్య పాత్రను ప్రముఖ హీరోయిన్ పోషిస్తుంది. తదుపరి షెడ్యూల్ హార్సీలీహిల్స్, నెల్లూరులో జరుగుతుంది అన్నారు. ఇంకా ఈ చిత్రంలో జీవా, ఎం ఎస్ నారాయణ, ప్రభాకర్, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం : సదివే దేవేంద్ర అందిస్తున్నారు, నిర్మాత ఎస్ వి ఎస్ రావు, కథ స్కీన్ ప్లే దర్శకత్వం: పోకూరు శ్రీధర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu