»   » షాకింగ్ : శ్రీదేవి డెత్ మిస్టరీలో దావూద్ హస్తం, మర్డర్ అంటూ సంచలన స్టేట్మెంట్!

షాకింగ్ : శ్రీదేవి డెత్ మిస్టరీలో దావూద్ హస్తం, మర్డర్ అంటూ సంచలన స్టేట్మెంట్!

Subscribe to Filmibeat Telugu
Sridevi Passes Away: It's Not A Cardiac Arrest, Twist ?

అతిలోక సుందరి శ్రీదేవి డెత్ మిస్టరీలో ప్రముఖులకు కూడా క్రమంగా అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏ విషయంలో అభిమానులే ఆందోళన చెందుతూ వచ్చారు. శ్రీదేవి మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేసారు కానీ, మీడియాలో రేగుతున్న అనుమానాల గురించి ఎవరూ మాట్లాడలేదు. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి శ్రీదేవి మృతి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీదేవి మృతి హత్య అయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. సుబ్రమణ్య స్వామికి కలుగుతున్న అనుమానాలు సంచలనంగా మారాయి.

 ఒక్కొకరుగా

ఒక్కొకరుగా

శ్రీదేవి మరణం సహజం కాదనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. సెలెబ్రిటీలు కూడా శ్రీదేవి మరణం విషయంలో అనుమానాల్ని వ్యక్త పరుస్తున్నారు. అభిమానుల్లో ఇప్పటికే ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే.

 శ్రీదేవిని హత్య చేశారు

శ్రీదేవిని హత్య చేశారు

సంచలన వ్యాఖలకు కేంద్ర బిందువుగా ఉండే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి శ్రీదేవి డెత్ మిస్టరీలో తన అనుమానాల్ని వ్యక్త పరిచారు. ఆయన వ్యాఖ్యలు సంచనలం సృష్టిస్తున్నాయి. శ్రీదేవి మరణం సహజం కాదని, ఆమెని హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుబ్రమణ్య స్వామి వ్యక్తం చేసిన అనుమానాలు

సుబ్రమణ్య స్వామి వ్యక్తం చేసిన అనుమానాలు

శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదు. అలాంటప్పుడు ఆమెకు శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఎలా వచ్చాయి. శ్రీదేవి బస చేసిన హోటల్ లో సిసి టివి ఫుటేజ్ ఏమైంది. శ్రీదేవి గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు మీడియాకు ఎందుకు చెప్పారు అంటూ సుబ్రమణ్య స్వామి తనకున్న అనుమానాల్ని వ్యక్తం చేసారు.

బలవంతంగా ముంచి

బలవంతంగా ముంచి

బాత్ టబ్ లో మునిగి చనిపోవడం అంత సులభం కాదని సుబ్రమణ్య స్వామి అన్నారు. ఎవరైనా బలవంతంగా టబ్ లో ముంచితే తప్ప మరణించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

మద్యం కూడా బలవంతంగా

మద్యం కూడా బలవంతంగా

శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదు. కనుక ఆమెచే ఎవరో బలవంతంగా మద్యం తాగించి ఉంటారనే అనుమానాల్ని వ్యక్తం చేసారు.

దావూద్ హస్తం అంటూ సంచలనం

దావూద్ హస్తం అంటూ సంచలనం

తాజగా మీడియాతో మాట్లాడిన సుబ్రమణ్య స్వామి శ్రీదేవి మృతి విషయంలో మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. శ్రీదేవి మృతి వెనుక మాఫియా డాన్ దావూద్ హస్తం ఉందేమో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు.

 దావూద్ పేరు ఎందుకు

దావూద్ పేరు ఎందుకు

తనకు దావూద్ పై ఎందుకు అనుమానం కలిగిందో సుబ్రమణ్య స్వామి వివరించారు. ముంబై ఆస్తి గొడవల విషయంలో దావూద్ ప్రమేయం ఉంటుందని మొదటినుంచి ప్రచారం ఉంది. అందువలన తనకు దావూద్ పై అనుమానంగా ఉందని అన్నారు.

సినీతారలతో దావూద్

సినీతారలతో దావూద్

సినీతారలతో దావూద్ రహస్య సంబంధాలు పెట్టుకుంటాడని, ఆ విషయంలో నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని సుబ్రమణ్య స్వామి అన్నారు.

English summary
Subramanian Swamy made sensational statement on Sridevi's death. He suspects Dawood hand in Sridevi death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu