twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌తోపాటు అదే రోజు.. ఇంట్లో మరో మరణం? రెండు అంబులెన్స్‌లు అందుకేనా?

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై పోలీసులు, ఈడీ దర్యాప్తు కొనసాగతుండగా రోజు రోజుకు అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఉండటం, ఆయన స్నేహితుడు శ్యామ్యూల్ హోకిప్ అదృష్యం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ క్రమంలో సుశాంత్ మరణంపై మరోసారి బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌లో చేసిన సంచలన ఆరోపణలు ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput:Subramanian Swamy Questions Why Two Ambulances At Sushant Home After His Demise
    సుశాంత్ ఇంటి వద్ద రెండు అంబులెన్సులు

    సుశాంత్ ఇంటి వద్ద రెండు అంబులెన్సులు

    సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు కనిపించాయి. ఒకరు మరణిస్తే బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.

    శామ్యూల్ హెకిప్ అదృశ్యంపై అనుమానాలు

    శామ్యూల్ హెకిప్ అదృశ్యంపై అనుమానాలు

    సుశాంత్ మరణించిన ముందు రోజు అంటే జూన్ 13 తేదీ రాత్రి ఆయనతోపాటు ఇంట్లో శామ్యూల్ హెకిప్ కూడా ఉన్నారనే విషయాన్ని ఇటీవల రిపబ్లిక్ టీవీ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటకు వచ్చింది. సుశాంత్ మరణం తర్వాత నుంచి శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

    శామ్యూల్ హెకిప్ బతికి ఉన్నాడా?

    శామ్యూల్ హెకిప్ బతికి ఉన్నాడా?

    సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్దకు రెండు అంబులెన్సులు రావడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ.. రెండు అంబులెన్సులు ఎందుకు వచ్చాయి? వాటి కోసం ఎవరు కాల్ చేశారు? ఈ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం రాకపోతే.. సుశాంత్‌కు నమ్మకస్తుడైన శ్యామ్యూల్ ఎందుకు అదృశ్యం అవుతాడు? అతడు ప్రాణాలతో ఉన్నాడా? లేక మరణించాడా? మరో అంబులెన్స్ వచ్చింది శ్యామ్యూల్ కోసమేనా? అనే ప్రశ్నలను స్వామి కురిపించారు.

    సుశాంత్ మరణం రోజున రెండు దేహాలు అంటూ

    సుశాంత్ మరణం రోజున రెండు దేహాలు అంటూ

    సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో కాళ్లు స్ట్రెయిట్‌గా ఉంటే.. మరో ఫోటోలో కాళ్లు ముడుచుకొని ఉన్న దేహాలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. తాజాగా సుబ్రమణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ ఫోటోలకు సంబంధించిన విషయం చర్చనీయాంశమవుతుంది.

    సీబీఐ దర్యాప్తకు డిమాండ్

    సీబీఐ దర్యాప్తకు డిమాండ్

    ఇదిలా ఉండగా, బాలీవుడ్‌తోపాటు అన్ని వర్గాల నుంచి సీబీఐ దర్యాప్తు జోరందుకున్నది. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాలంటే సిబీఐ దర్యాప్తు చేయాల్సిందనే అనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. వరుణ్ ధావన్, జరీన్ ఖాన్, జియా ఖాన్ సిస్టర్స్ లాంటి తారలు, సెలబ్రిటీలు తమ మద్దతును తెలియచేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ వచ్చే వాయిదా పడటంతో సుశాంత్ కేసును సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తారనే విషయం పెండింగ్‌లో ఉంది.

    English summary
    Subramanian Swamy questions over two ambulance at Sushat Singh Rajput home on death day. He wrote on twitter that, Why were two ambulance? Who called them? If I don’t get truthful answers we may get a clue why SSR loyal servant Samuel is missing . Is he alive or dead.? Was one ambulance intended for him?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X