»   » ఫస్ట్ లుక్ వచ్చేసింది.., నువ్వు తోపురా

ఫస్ట్ లుక్ వచ్చేసింది.., నువ్వు తోపురా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొంత విరామం తరువాత మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు రెడీ అయ్యాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న నువ్వు తోపురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధాకర్ కోమాకుల డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం(జూన్ 2) విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న "నువ్వు తోపురా" చిత్రీకరణ 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం.


Sudhakar komakula Nuvvu Topura First Look

30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న "నువ్వు తోపురా" టీజర్ ను జూన్ 9న విడుదల చేయనున్నాం. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తాడన్న నమ్మకం ఉంది" అన్నారు.


English summary
Life is Beautiful Actor Sudhakar Komakula movie "Nuvvu Topura" first look released Today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu