»   » బాలయ్య సినిమాకు, మహేష్ బాబు బావకు సంబంధం లేదు!

బాలయ్య సినిమాకు, మహేష్ బాబు బావకు సంబంధం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య 101వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభం అయింది. ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికరమైన వార్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడనేది ఆ వార్తల సారాంశం.

ఈ వార్తలు రావడానికి కారణం బాలయ్య సినిమా ప్రారంభోత్సవంలో సుధీర్ బాబు పాల్గొనడమే. హీరోగా సక్సెస్ కాలేక పోయిన సుధీర్ బాబు విలన్ గా తన ప్రయత్నాలు మొదలు పెట్టాడని గాసిప్స్ ఊపందుకున్నాయి. బాలీవుడ్ మూవీ బాఘీలో సుధీర్ బాబు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Sudheer Babu PR Team condemns rumours

అయితే బాలయ్య సినిమాలో సుధీర్ బాబు విలన్ పాత్ర చేస్తున్నాడనే వార్తలో లేదంటున్నారు సుధీర్ బాబు పీఆర్ టీమ్. బాలయ్య సినిమాకు సుధీర్ బాబు అలాంటి కమిట్మెంట్ ఏమీ తీసుకోలేదని తెలిపారు.

సుధీర్ బాబు తెలుగులో హీరో పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడని, విలన్ పాత్రలు చేసే ఆలోచన ఆయనకు లేదని అంటున్నారు. ఇతర భాషల్లో కూడా సుధీర్ బాబు విలన్ పాత్రలకు ప్రయత్నాలు ఏమీ చేయడం లేదని అంటున్నారు.

English summary
Sudheer Babu graced the Formal Muhurat of Nandamuri Balakrishna's 101st Flick under Puri Jagannath's Direction. SInce then, Speculation began doing rounds that Mahesh's Brother-in-Law is the main antagonist of NBK101. Sudheer Babu's PR Team condemned the rumours and clarified there is no such proposal from the makers of Balayya's Next.Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu