»   » ఫెరఫెక్ట్ టైమ్ :మహేష్ పుట్టిన రోజునే.. ఫస్ట్‌లుక్‌ వదిలాడు

ఫెరఫెక్ట్ టైమ్ :మహేష్ పుట్టిన రోజునే.. ఫస్ట్‌లుక్‌ వదిలాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సుధీర్‌ బాబు హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భలే మంచిరోజు'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర హీరో సుధీర్‌ బాబు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Here goes the 1st look of my next movie #BhaleManchiRoju. Hope you guys like it.

Posted by Sudheer Babu on 8 August 2015

ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై విజయ్‌, శశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘సినిమా కొత్తగా, ఊహించని మలుపులతో, ఆసక్తికరంగా ఉంటూనే వినోదాన్ని పంచే కథ ఇది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసిన లఘు చిత్రాలు చూసి తను ఓ సినిమా బాగా తీయగలడని నమ్మకం ఏర్పడింది. విశ్వరూపం-2, ఉత్తమ విలన్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ ఈ చసినిమాకు పని చేస్తుండటం అదనపు బలం. సన్నీ సంగీతం అందిస్తున్నారు. మంచి టీం దొరికినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.

నిర్మాత విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కథనానికి ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది. మూడు షెడ్యూల్స్ లో మేలో చిత్రాన్ని పూర్తి చేసి, జూన్ చివర్లో సినిమాను విడుదల చేస్తాం. యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీం దొరికింది. ఎంతో ఎనర్జిటిక్ గా సినిమా మొదలు పెట్టాం. అంతే ఎర్జిటిక్‌గా పూర్తి చేస్తాము.

Sudheer Babu's Bhale Manchi Roju movie First look

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ... ‘చాలా ఫ్రెష్ గా అనిపించే కథ కథనాలతో పట్టు సడలకుండా సాగే సినిమా ఇది. నా తొలి సినిమాకే సుధీర్ బాబు లాంటి హీరో దొరకడం చాలా ఆనందంగా ఉంది. టాప్ టెక్నీషియన్స్ నా సినిమాకి పని చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాం' అన్నారు.

సుధీర్ బాబు, వామికా గబ్బి, పోసాని, పృథ్విరాజ్, పరుచూరి గోపాల కృష్ణ, ప్రవీణ్, వేణు, విద్యులేఖ, శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి కో-డైరెక్టర్: శ్రీరామ్ ఎగరం, కాస్ట్యుం డిజైనర్: భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, పి.ఆర్.ఓ: సాయి వరుణ్, మాటలు: అర్జున్ గున్నాల, కార్తీక్, కెమెరా: ష్యామ్ దత్, సంగీతం: ఎంఆర్: సన్నీ, నిర్మాతలు: విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య.

English summary
Sudheer Babu posted in Facebook: " Here goes the 1st look of my next movie ‪#‎BhaleManchiRoju‬. Hope you guys like it."
Please Wait while comments are loading...