For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నరనరాల్లో పవన్ కళ్యాణ్.. రష్మీని టచ్ చేశాం కానీ.. సీక్రెట్స్ చెప్పేసిన సుడిగాలి సుధీర్

  |

  బుల్లితెరపై తమదైన మార్క్ చూపిస్తూ భారీ పాపులారిటీ తెచ్చుకున్న నటీనటులంతా వెండితెర బాట పట్టేస్తున్నారు. వీరికున్న బుల్లితెర క్రేజ్ క్యాచ్ చేసుకునేలా దర్శక నిర్మాతలు సైతం అవకాశాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బుల్లితెరపై రాణిస్తూనే వెండితెర బాట పట్టిన వారిలో హాట్ యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీ ముఖి, చమ్మక్ చంద్ర.. ఇలా చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా జబర్దస్త్ వీరుడు సుడిగాలి సుధీర్ కూడా ఎంటర్ అయ్యాడు. సుధీర్ హీరోగా కొత్త సినిమా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సుధీర్ ఆసక్తికరంగా మాట్లాడాడు. వివరాల్లోకి పోతే..

  సుడిగాడు కాస్తా.. సాఫ్ట్‌వేర్ సుధీర్ అయ్యాడు

  సుడిగాడు కాస్తా.. సాఫ్ట్‌వేర్ సుధీర్ అయ్యాడు

  శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన 'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

  అప్పుడే టెన్షన్ నుంచి రిలీఫ్

  అప్పుడే టెన్షన్ నుంచి రిలీఫ్

  ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సుడిగాలి సుధీర్.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకూ చాలా టెన్షన్ పడ్డానని తెలిపాడు. మొత్తానికి షూటింగ్ ఫినిష్ చేశానని, ఇది విడుదలయ్యాక జనాలకు నచ్చితే ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ దొరుకుతుందని అన్నాడు.

  విజయం సాధిస్తే సంతోషమే.. లేదంటే

  విజయం సాధిస్తే సంతోషమే.. లేదంటే

  కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని అన్నాడు సుధీర్. తనకు ఇదే మొదటి సినిమా కాబట్టి విజయం సాధిస్తే సంతోషమే.. లేదంటే ఈ సినిమాలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటానని చెప్పాడు. కథ ఆధారంగానే ఈ సినిమాకు సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే టైటిల్ అనే టైటిల్ పెట్టారని అన్నాడు.

  ఫస్ట్ రష్మీనే టచ్ చేశాం

  ఫస్ట్ రష్మీనే టచ్ చేశాం

  ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ధన్యా బాలకృష్ణను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రష్మీతో నేను అనే పాపులారిటీని క్యాచ్ చేసుకునేలా ముందుగా చిత్ర యూనిట్ ఆమెనే సంప్రదించిందని, అయితే అప్పటికే ఆమె వేరే సినిమాకు కమిట్ కావడం, డేట్స్ కుదరక పోవడం కారణంగానే ధన్యా బాలకృష్ణను ఫైనల్ చేసినట్లు సుధీర్ వెల్లడించాడు.

  నరనరాల్లో పవన్ కళ్యాణ్

  నరనరాల్లో పవన్ కళ్యాణ్

  ఈ సినిమాలో రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఇమిటేషన్స్ ఉన్నాయని తెలిపిన ఆయన డైరెక్టర్ చెప్పిన విధంగానే చేశానని అన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రతీ మూమెంట్ తన నరనరాల్లో ఉందని, అంతగా ఆయన ఇంజెక్ట్ అయ్యారని.. పవన్ తన బ్లడ్ లో ఉన్నారని అన్నాడు.

  Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
  మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చింది

  మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చింది

  సాఫ్ట్‌వేర్ సుధీర్ రూపంతో నా తొలి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చిందని.. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని సుధీర్ తెలిపాడు. ఈ సినిమా వకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని చెప్పిన ఆయన డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకానుందని అన్నాడు.

  English summary
  Jabardasth fame Sudigali Sudheer enter into the cinema. His first movie Software Sudheer is comes on December First week. In this movie promotion Sudheer told about Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X