For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాహో: ప్రభాస్‌కు సూపర్ స్టార్ హెల్ప్ అవసరం లేదా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

|
Saaho Director Sujeeth Clarification On Rumours On Movie || Filmibeat Telugu

'బాహుబలి' లాంటి భారీ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెకకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో వేళ్లపై లెక్కించగల హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఇదీ ఒకటి.

భారీ బడ్జెట్ మూవీ కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ పెంచడానికి, పెట్టుబడి తిరిగి రాబట్టడానికి నిర్మాతలు చాలా ప్లాన్స్ వేస్తున్నారని, అందులో భాగంగానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సహాయం తీసుకోవాలని నిర్ణయించారని, ఆయనతో అతిథి పాత్ర చేయించడం ద్వారా వీలైనంత మంది హిందీ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.

ప్రభాస్‌కు సూపర్ స్టార్ హెల్ప్ అవసరం లేదా?

సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర విషయంలో మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై ఇప్పటి వరకు చిత్ర బృందం నోరు విప్పలేదు. అయితే కొందరు యూనిట్ సభ్యులు మాత్రం అనధికారికంగా ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ప్రభాస్‌కు సూపర్ స్టార్ హెల్ప్ అవసరం లేదని, బాహుబలి ద్వారా ఆయనకు వచ్చిన క్రేజ్ థియేటర్ల వైపు ప్రేక్షకులను ఆకర్షించగలదని అంటున్నారు.

ఎట్టకేకు క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

‘సాహో'లో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఎట్టకేలకు దర్శకుడు సుజీత్ స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికతో ఈ విషయమై స్పందిస్తూ.... సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేయడం లేదని స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది, ఇలాంటి రూమర్స్ ఎలా వచ్చాయో అర్థం కావడం లేదన్నారు.

సర్దుకుపోతే అవకాశమిస్తాం అన్నారు..సినీరంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయి:అదితీ రావు హైదరీ

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్

ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘సాహో' బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. హాలీవుడ్ చిత్రాకు ఏ మాత్రం తీసిపోకుండా హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతోంది. ఇందుకోసం పలువురు హాలివుడ్ టెక్నీషియన్లను హైర్ చేసుకున్నారు. అబుదాబిలో చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలుట్ కానుంది. బడ్జెట్ మొత్తంలో యాక్షన్ సీన్ల కోసమే రూ. 90 కోట్ల ఖర్చు చేశారట.

సాహో

ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ చేయడంతో పాటు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, ఎవలీన్ శర్మ లాంటి హిందీ స్టార్లను ముఖ్య పాత్రలకు ఎంపిక చేశారు.

English summary
Sujeeth clarified that Salman is not doing any cameo in Saaho. Saaho is an upcoming Indian trilingual action thriller film written and directed by Sujeeth, and produced by UV Creations and T-Series. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff and others in supporting roles. It is being shot simultaneously in Hindi, Tamil and Telugu languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more