»   » మొన్నామధ్య ఎన్టీఆర్ కి ఓ పాయింట్‌ చెప్పా

మొన్నామధ్య ఎన్టీఆర్ కి ఓ పాయింట్‌ చెప్పా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మొన్నామధ్య కలిసి ఓ పాయింట్‌ చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. ఇప్పుడు కథ సిద్ధం చేయాలి అంటున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. అలాగే చిత్రం త్వరలోనే ఉండబోతుందని వివరించారు. ఇక చిత్రం ఎలా ఉండబోతుందో చెప్తూ...ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాను. ఆయన ఇమేజ్‌కు అనుగుణంగా నా శైలిలో వుండే కమర్షియల్ చిత్రమది అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్రం అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటిని ఖరారు చేస్తూ సుకుమార్ ఇలా చెప్పుకొచ్చారు.

ఇప్పటికే సుకుమార్‌ జూ.ఎన్టీఆర్‌ కోసం కథ రెడీ చేశారని, జూ.ఎన్టీఆర్‌ కూడా ఆయన దర్శకత్వంలో చేయడానికి దానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఇప్పటి వరకు యూత్‌, అండ్‌ కాలేజీ స్టోరీలతో సినిమాలను రూపొందించిన సుకుమార్‌....ఎన్టీఆర్‌తో చేసే సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి పూర్తి భిన్నమైన కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

Sukumar confirmed his film with NTR

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమాని ఓకే అయినప్పటినుంచి మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ ఫైనల్ అయ్యిందని చెప్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ఈ చిత్రం టైటిల్ 'యంగ్ స్టార్' . 'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

ఇక ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో బి.వియస్ ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు కు ఉన్న స్నేహంతో ఈ ప్రాజెక్టుకి ఇమ్మిడియట్ గా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. అప్పటివరకూ ప్లాఫ్ లతో లాస్ లలో ఉన్నా 'అత్తారింటికి దారేది' ఘన విజయంతో నిర్మాతగా ఒడ్డున పడ్డారు ప్రసాద్.

English summary

 NTR and director Sukumar who are currently busy with their respective films ‘Rabhasa’ and ‘1’ are getting ready to come together with a complete commercial entertainer. The film will be going to sets in the month of March. The news is already attracting the fans of Young Tiger.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu