twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముఖ్యమంత్రి పదవికన్నా చిరంజీవి పదవే పెద్దది..ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లారో!

    |

    Recommended Video

    సుకుమార్ కి ఇంత దైర్యం ఎలా వచ్చింది ?

    ఉగాది పర్వదినాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖ సాగరతీరాన వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రంగస్థలం చిత్ర యూనిట్ సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ వైభవంగా జరగడం విశేషం. సినిమాలో నటించిన నటీ నటులు, టెక్నీషియన్స్ అంతా రంగస్థలం చిత్రం విషయంలో తమ అనుభూతులని పంచుకున్నారు. దర్శకుడు సుకుమార్ ప్రసంగం అభిమానులతో సహా అందరిని ఆకట్టుకుంది. టెక్నీషియన్స్, నటీ నటులు ఒక్కొక్కరి గురించి ఆయన అద్భుతంగా మాట్లాడారు.

    అభిమాన నటుడు చిరంజీవి అంటూ

    అభిమాన నటుడు చిరంజీవి అంటూ

    తన అభిమాన నటుడు చిరంజీవి గారికి, పితృ సమానులైన అల్లు అరవింద్ గారికి నా ప్రణామాలు అంటూ సుకుమార్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టడం విశేషం.

     ఈ విషయం మాట్లాడకూడదు..అయినా

    ఈ విషయం మాట్లాడకూడదు..అయినా

    ఈ విషయం తాను ప్రస్తావించకూడదు అయినా కూడా మాట్లాడతానని సుకుమార్ చిరు రాజకీయ ప్రస్తావన తీసుకుని వచ్చారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్న మాటని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కన్నా చిరంజీవి పదవే గొప్పది కదా.. ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అని దేవి తనతో అన్నట్లు సుకుమార్ తెలిపారు.

     నా భార్య అయినా పక్కన ఉండాల్సింది

    నా భార్య అయినా పక్కన ఉండాల్సింది

    రంగస్థలం సినిమా చూసాక చిరంజీవి గారు తనని ఇంటికి పిలిచారని సుకుమార్ అన్నారు.ఆయన ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మరచిపోలేనిదని సుకుమార్ అన్నారు. ఆ సమయంలో తన సంతోషాన్ని పంచుకోవడానికి పక్కన ఎవరూ లేరని భాదపడ్డట్లు సుకుమార్ తెలిపారు. కనీసం నా భార్య పక్కన ఉన్నా సంతోషించి ఉండేదని సుకుమార్ అభిప్రాయ పడ్డారు.

    అద్భుతమైన సినిమాటోగ్రఫీ

    అద్భుతమైన సినిమాటోగ్రఫీ

    రత్నవేలు ఈ చిత్రానికి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారని సుకుమార్ తెలిపారు. తాను ఒకవేళ గుడ్ డైరెక్టర్ అయితే.. గుడ్ అనేది రత్నవేలు వలనే అని సుకుమార్ కితాబిచ్చారు.

    కేవలం మూడున్నర రోజుల్లోనే

    కేవలం మూడున్నర రోజుల్లోనే

    దేవిశ్రీ ప్రసాద్ కేవలం మూడున్నర రోజుల్లోనే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని సుకుమార్ అన్నారు.

     చంద్రబోస్ గురించి

    చంద్రబోస్ గురించి

    ఈ చిత్రానికి అన్ని పాటలని రచయిత చంద్రబోస్ అందించారు. ఆయన ఈ చిత్రానికి అద్భుతమైన లిరిక్స్ అందించినట్లు సుకుమార్ కొనియాడారు.

     సమంత గురించి

    సమంత గురించి

    సమంతని ఎప్పుడు డైరెక్ట్ చేస్తూనే ఉండాలి అనిపించేంతగా ఈ చిత్రంలో నటించిందని సుకుమార్ తెలిపారు. రామలక్ష్మి పాత్రని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

     యంగ్ అత్త అనసూయ

    యంగ్ అత్త అనసూయ

    అనసూయని అనసూయ అత్త అంటూ సుకుమార్ చమత్కరించారు. అనసూయ ఆంధ్రకు యంగ్ అత్తా అని అన్నారు. అనసూయని ఆ పాత్రలో చూపించడానికి చాలా కష్టపడవలసివచ్చిందని సుకుమార్ తెలిపారు.

     5 రోజులు మాట్లాడలేదు

    5 రోజులు మాట్లాడలేదు

    మొదటి 5 రోజుల షూటింగ్ లో తాను ఆదితో మాట్లాడలేదు అని సుకుమార్ అన్నారు. ఎందుకంటే ఆది కి సలహాలు ఇవ్వడానికి ఏమి లేదని ఆయన తన పాత్రలో అంతగా ఒదిగిపోయారని సుకుమార్ అన్నారు.

    చరణ్ కోసం సుస్మిత

    చరణ్ కోసం సుస్మిత

    రాంచరణ్ కోసం వాళ్ళ అక్క సుస్మిత స్వయంగా పోలవరంలో షాపింగ్ చేసారని సుకుమార్ అన్నారు. చిరంజీవి కుమార్తె అయి ఉంది పోలవరం లాంటి చోట స్వయంగా తిరగడం ఆశ్చర్యపరిచే విషయం అని అసుకుమార్ అన్నారు.

     చిట్టిబాబు విశేషాలు

    చిట్టిబాబు విశేషాలు

    రాంచరణ్ తొలిసన్నివేశం నుంచే తన పాత్రలో ఒదిగిపోయాడని సుకుమార్ అన్నారు. రాంచరణ్ నటించిన తన తొలి సన్నివేశానికి సెట్స్ లో ఉన్నవారంతా చప్పట్లతో మారు మ్రోగించారని సుకుమార్ తెలిపారు.

    English summary
    Sukumar Emotional Speech about Chiranjeevi. Sukumar talks about Rangasthalam movie unit
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X