»   » ఎన్టీఆర్ తో చిత్రం ఆగిందనే విషయంపై సుకుమార్

ఎన్టీఆర్ తో చిత్రం ఆగిందనే విషయంపై సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించనున్న సినిమా ఆగిపోయిందంటూ వార్తలు మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాతో సుకుమార్ మాట్లాడారు. ఆయన అటువంటిదేమీ లేదని స్పష్టం చేసారు. తాను పూర్తిగా స్క్రిప్టుపై బిజీగా ఉన్నానని అన్నారు. నిర్మాతలు సైతం ఇది రూమరే అని ఖండించారు.

సుకుమార్ మాట్లాడుతూ... "ఎవరు,ఎందుకు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారనే విషయం నాకు అర్దం కావటం లేదు. నేను,ఎన్టీఆర్ ఈ గాసిప్స్ విని నిజంగా నవ్వుకున్నాం. ప్రాజెక్టు ఆన్ లోనే ఉంది..స్క్రిప్టు వర్క్ జరుగుతోంది ," అన్నారు. ఈ చిత్రం కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పుణేలో దర్శకుడు కథా చర్చలతో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు తారాగణం, సాంకేతిక బృందం ఎంపిక కూడా జరుగుతోంది. మే నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత.

Sukumar

మరో ప్రక్క ఎన్టీఆర్‌ హీరోగా సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌ నిర్మాత. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 13 నుంచి హీరో,హీరోయిన్స్ పై ఓ పాటను చిత్రీకరిస్తారు. రాజు సుందరం నృత్య రీతులు సమకూరుస్తారు.

దర్శకుడు మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగ్గ కథ ఇది. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ... వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల పొల్లాచ్చిలో అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన పాట సినిమాకి ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అన్నారు. సినిమాకి 'రభస' అనే పేరుని పరిశీలిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించే చిత్రమిది. ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
"I have no clue who is spreading such rumours and why. Honestly, NTR and I are laughing at the gossip. The project is on and I am working on the script right now," revealed Sukumar. The director is at a hill city, near Pune these days and he's expected to be back in town by the end of this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu