»   » మహేష్ బాబు కొడుకు గురించి... షాకింగ్ విషయాలు!

మహేష్ బాబు కొడుకు గురించి... షాకింగ్ విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కొడుకు గౌతం కృష్ణ వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులో పిల్లలు ఏ విధంగా ఉంటారు? పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ గౌతం కృష్ణ నేను పిల్లాన్ని కాదు పిడుగును అనే విధంగా అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న '1 నేనొక్కడినే' చిత్రంలో గౌతం కృష్ణ తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం చిత్రీకరణ సందర్భంగా దర్శకుడు సకుమార్.....ఇంత చిన్న వయసులో గౌతం కృష్ణ మెచ్యూరిటీ చూసి షాకయ్యాడట. సెట్లోకి రాగానే గౌతం కృష్ణ 'అంకుల్ ఈ రోజు సీన్ ఏంటి' అని సుకుమార్‌ను అడిగే వాడట. ఎలా యాక్ట్ చేయాలో సుకుమార్ వివరిస్తుంటే....'అవన్నీ వద్దు అంకుల్, హ్యాపీ సీనా, స్యాడ్ సీనా? చెప్పండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను' అంటూ అశ్చర్యపరిచేవాడట.

తన పాత్రకు డబ్బింగ్ సమయంలో కూడా సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేయడమే కాదు....ఇది చాలా, మరోసారి డైలాగ్ చెప్పాలా అంటూ యూనిట్ సభ్యులు అంతా ఆశ్చర్య పడేలా చేసాడట గౌతం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....తనపై పాటలేం లేవా అంటూ సుకుమార్‌ను గౌతం అడగటం. గౌతం ఈ రేంజిలో మెచ్యూరిటీ చూపిస్తాడని ఊహించ అతని పాత్రను కొంత వరకే పరిమితం చేసాడట సుకుమార్.

మొత్తానికి మహేష్ బాబు తనయుడి వరుస చూస్తుంటే....భవిష్యత్‌లో తండ్రిని మించి పోతాడని స్పష్టమవుతోంది. ఇంట్లో అమ్మా, నాన్న ఇద్దరూ యాక్టర్లే కాబట్టి చిన్నప్పటి నుండే గౌతంకు అన్నీ విషయాలు నేర్పారని, ఆ ఎఫెక్టు వల్లనే గౌతం చిన్న వయసులోనే చాకులా తయారయ్యాడని స్పష్టమవుతోంది.

English summary
Director Sukumar revealed a lot interesting details about Mahesh Babu's son Gautham Krishna who made his debut with '1 - Nenokkadine'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu