»   » సుకుమార్ కాపీ కొట్టాడని ప్రూవ్ చేస్తున్నారు

సుకుమార్ కాపీ కొట్టాడని ప్రూవ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :స్టార్ డైరక్టర్ సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌' మొన్న శుక్రవారం విడుదలైంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అదే సమయంలో చిత్రం పూర్తి కాపీ అనే టాక్ ని సొంతం చేసుకుని అపఖ్యాతిని మూటుకట్టుకుంది. అంతేకాదు సుకుమార్ అంతటి వాడు కాపీ చేయటమేంటంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కుమారి 21 ఎఫ్ చిత్రానికి మూలం లైలా సేస్ అనే ఫ్రెంచ్ సినిమా అని తేల్చారు . 2004లో వచ్చిన ఈ చిత్రం కథ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండటంతో ఇలాంటి అభిప్రాయానికి వచ్చారు. స్రీన్ ప్లే మొత్తం దాదాపు అలాగే సాగుతూ..ప్రీ క్లైమాక్స్ లో ఉన్న బలమైన మలుపు ఏదైతే ఉందో అది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది.


Sukumar's Kumari 21 fm copy of a French film titled ‘Lila Says’.

ఇక క్లైమాక్స్ ని అందరూ మెచ్చుకుంటూంటే... ఆ సన్నివేశం కూడా ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ అనే సినిమాలోది కావటం కూడా అభిమానులకు ఆశ్చర్యంగా మిగిలింది.


పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
Those who watched ‘Kumari 21F’ may find it’s nothing but a carbon copy of ‘Lila says’
Please Wait while comments are loading...