»   » సుకుమార్ పక్కన ఎన్టీఆర్, రాంచరణ్.. థాంక్యూ డియర్!

సుకుమార్ పక్కన ఎన్టీఆర్, రాంచరణ్.. థాంక్యూ డియర్!

Subscribe to Filmibeat Telugu

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం కలెక్షన్ల సునామీలో పాత రికార్డులన్నీ కొట్టుకుపోతున్నాయి. రాంచరణ్, సుకుమార్ కలసి రంగస్థలం చిత్రంతో అద్భుతమే ఆవిష్కరించారు. రంగస్థలం చిత్రం విజయం సాధించడంతో ప్రముఖుల నుంచి చిత్ర యూనిట్ కు ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగస్థలం చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వం గురించి ఎన్టీఆర్ ఓ రేంజ్ లో ప్రశంసించాడు. చిట్టిబాబు పాత్రని రాంచరణ్ మినహా మరెవరూ చేయలేరని ఎన్టీఆర్ కితాబిచ్చాడు. సుకుమార్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభని కనబరిచాడని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తెలిపాడు.

ఎన్టీఆర్ ప్రశంసలకు స్పందించిన రాంచరణ్ కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యలకు సుకుమార్ కూడా స్పందించారు. బిజీ షెడ్యూల్ లో కూడా తమ రంగస్థలం చిత్రం గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేసినందుకు సుకుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు. థాంక్యూ డియర్ ఎన్టీఆర్ అంటూ సుకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

English summary
Sukumar thanks NTR about his beautiful words on Rangasthalam movie. He shares photo with Charan and NTR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X