For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవిలా చేయలేరు: ఆది (సుకుమారుడు ఆడియో పిక్స్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ఆది, నిషా అగర్వాల్ జంటగా జి.అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సుకుమారుడు'. కె.వి.వి. సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను వంశీ పైడిపల్లి, థియేట్రికల్ ట్రైలర్ ను నాని ఆవిష్కరించారు.

  ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ 'ఇప్పటికే అనూప్ తో రెండు సినిమాలు చేసాను. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టినట్లయింది. అనూప్ ఎప్పుడూ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇస్తాడు. మా కాంబినేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. డాన్సుల్లో నాకు ఆదర్శం చిరంజీవి. ఈ సినిమాలోని సుకుమారుడు సుకుమారుడు పాట అబ్బనీ తీయ్యని దెబ్బ అనే పాటను గుర్తుకు తెస్తుంది. అందులో 10 శాతం చేసినా చాలు అని నేను, డాడి అనుకున్నాం. చిరంజీవిలా ఎవరూ డాన్స్ చేయరు..చేయలేరు. ఆయనే బెస్ట్, ఎవర్ గ్రీన్' అన్నారు.

  ఈ సినిమాలో 60 మంది ఆర్టిస్టులం కలిసి పని చేసాం. కృష్ణ గారితో కలిసి ఓ సీన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ రాని అవకాశం. ముఖ్యంగా మా జనరేషన్లో అలాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశం ఎవరికీ రాదు. నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకు ఏడాది సమయం తీసుకున్నా బాగా వచ్చిందనే నమ్మకంతో ఆనందంగా ఉన్నాను అని ఆది తెలిపారు.

  ఈ కార్యక్రమంలో రమేష్ పుప్పాల, బెల్లంకొండ సురేష్, వరుణ్ సందేష్, సందీప్ కిషన్, సాగర్, టి. ప్రసన్నకుమార్, అశోక్ కుమార్, డిఎస్ రావు, సురేష్ కొండేటి, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియదర్శిని, సుబ్బారెడ్డి, అభిలాష్, భీమినేని శ్రీనివాసరావు, సి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

  ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు.

  ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.

  English summary
  Aadhi and Nisha Agarwal's 'Sukumarudu' audio launched in Hyderabad. 'Pilla Jamindhar' fame Ashok is the director of this film. K. Venugopal is producing and KVV Satyanarayana is presenting the movie under Sri Soudhamini creations banner. Super star Krishna and Urvasi Sharadha play the key roles in this film. Anup Rubens is the music director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X