»   » వివాదాస్పద కామెంట్స్: బాలయ్యకు మద్దతు పెరుగుతోంది!

వివాదాస్పద కామెంట్స్: బాలయ్యకు మద్దతు పెరుగుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల సావిత్రి ఆడియో వేడుకలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బాలకృష్ణకు నటుడు సుమన్ మద్దతుగా నిలిచారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పినా..ఆయన వ్యాఖ్యలపై రాజకీయం చేయడం సరికాదని సుమన్ అన్నారు. బాలకృష్ణ ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారని విశాఖలో ఉన్న సుమన్ అన్నారు.

సుమన్ తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు బాలయ్యకు మద్దతు ప్రకటించారు. బాలయ్య ఏదో సరదాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే అని...... తన సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో చేప్పే క్రమంలో బాలయ్య అలా మాట్లాడారే తప్ప మహిళలను అవమానించాలనే ఉద్దేశ్యం కాదని అంటున్నారు.

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య చేసిన కామెంట్స్ ఇవే..

Suman-Balakrishna

తన మాటలు వివాదాస్పదం కావడంతో బాలయ్య సోమవారం మీడియా ముఖంగా స్పందించారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెప్పాలని అన్నారు. తన చిత్రాల్లో మహిళలకు ప్రాధాన్యత, గౌరవం ఇస్తానని చెప్పారు. నా సినిమాల్లో జనం ఏం కోరుకుంటున్నారో చెప్పేందుకే తాను ఆరోజు అలా మాట్లాడానని అభిప్రాయపడ్డారు. సినిమాల పరంగా మాత్రమే తాను ఆ రోజు మాట్లాడానని చెప్పారు.

తన గురించి తన చిత్రాల్లో నటించే మహిళా నటులకు బాగా తెలుసని కూడా ఆయన తెలిపారు. తన తండ్రి చిత్రాల్లోలాగే తన చిత్రాల్లోనూ మహిళలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలు కూడా తన చిత్రాలను, మహిళల పట్ల తన వైఖరిని గుర్తుంచుకుంటాయని కూడా బాలయ్య పేర్కొన్నారు.

English summary
Suman supports Balakrishna about controversial comments against women.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu